Cyclone Michaung: అల్లకల్లోలం.. బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిన మిచౌంగ్‌ తుఫాన్‌..

Cyclone Michaung Updates: మిచౌంగ్‌ తుఫాన్‌ బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. మరికాసేపట్లో తీరాన్ని పూర్తిగా దాటనుంది. తీరాన్ని దాటిన అనంతరం స్వల్పంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. తుఫాను ప్రభావంతో బాపట్ల తీర ప్రాంతంలో భారీ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది.

Cyclone Michaung: అల్లకల్లోలం.. బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిన మిచౌంగ్‌ తుఫాన్‌..
Cyclone Michaung
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 05, 2023 | 4:06 PM

Cyclone Michaung Updates: మిచౌంగ్‌ తుఫాన్‌ బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. మరికాసేపట్లో తీరాన్ని పూర్తిగా దాటనుంది. తీరాన్ని దాటిన అనంతరం స్వల్పంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. తుఫాను ప్రభావంతో బాపట్ల తీర ప్రాంతంలో భారీ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. తీరాన్ని తాకిన సమయంలో 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచాయి. గాలుల తీవ్రతకు చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయాయి. కరెంట్ సరఫరా నిలిచింది. తీరానికి 10 కిలోమీటర్ల పరిధిలోని ఉన్న గ్రామాల్లోని పూరిళ్లు కూలిపోయాయి. తీరం సమీపంలో.. రోడ్లపై ఉన్న చిన్న తాత్కాలిక దుకాణాలు ఈదురుగాలులకు కొట్టుకుపోయాయి. జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. వందల సంఖ్యలో రైలు సర్వీసులను రద్దు చేశారు అధికారులు.

బాపట్ల, తిరుపతి, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లోనూ తుఫాన్ ఎఫెక్ట్ ఉంది. దాదాపు 11 జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. దీంతో 11 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ. రాబోయే 24 గంటల్లో తుఫాన్ ప్రభావం ఉంటుందని.. అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఇప్పటికే బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వాగులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..