Crows Attention: కాకి గోల అని కొట్టిపారేయొద్దు.. ఆ గోల ఒక ప్రాణాన్ని నిలిపింది..
ప్రాణం పోయడంలో మనుషుల కంటే మూగజీవాలే బెస్ట్.. ఒకటి కోసం మరొకటి కలిసి కట్టుగా జీవిస్తుంటాయి. చిన్న కష్టమొచ్చినా మేమున్నామని ముందుకొస్తాయి. నడి రోడ్ మీద..

ప్రాణం పోయడంలో మనుషుల కంటే మూగజీవాలే బెస్ట్.. ఒకటి కోసం మరొకటి కలిసి కట్టుగా జీవిస్తుంటాయి. చిన్న కష్టమొచ్చినా మేమున్నామని ముందుకొస్తాయి. నడి రోడ్ మీద ఒక యువతిని ఒక రాక్షసుడు కత్తితో పొడిస్తే కాపాడటానికి ఎవరు ముందుకురాని ఘటనలను మనం చాలా సార్లు చూశాం. అ మాట కు వస్తే కనీసం యాక్సిడెంట్ జరిగి బాధితులు విలవిలలాడుతున్నా ఒక్కరూ సహాయం చేయని ఘటనలు చాలా విన్నాం. అంతేకాదు అతడిని ఆసుపత్రికి తీసుకువేళ్లటానికి సైతం ఎవరు సాహసించరు . మనకెందుకు కేసులు, గొడవలు అని అలోచిస్తారు. మనిషికి మనిషికి మానవ సంబంధాలు తగ్గటం ఈ పరిణామాలకు ఒక కారణం కావచ్చు. కాని జంతువులు, పక్షులలో మాత్రం ఇంకా అలాంటి లక్షణాలు, మార్పు కనిపించటం లేదు. అందుకు కారణం వాటికి స్వార్ధం లేకపోవటంగా మనం భావించవచ్చు. ఇలా పక్షులు చూపించే గుణాలు ఒక్కోసారి అందరిని ఆకట్టుకుంటాయి.
అలాంటి ఘటన పశ్చిమగోదావరిజిల్లా లోని కామవరపుకోటలో జరిగింది. ఒక ఇంటి వద్ద చెట్ల పై కాకులు పదుల సంఖ్యలో చేరి గుమికూడి గోలచేస్తున్నాయి. దీంతో వాటి గోల చూసి కొందరు ఈ కాకి గోల ఎంటిరా బాబు..! అని విసుక్కున్నారు. కానీ స్థానికుడైన మధుసూదన్ కాకులు ఎందుకు అరుస్తున్నాయని చుట్టూ చూసాడు. అయితే నూతిలో ఒక కాకి పడి పోయి ఉండటం అతని కంట పడింది.
వెంటనే దాన్ని బకెట్ సహాయంతో బయటకి తీసి రోడ్ మీద వదిలేసాడు. దీంతో కొద్దిసేపటికి కోలుకున్న కాకి చెట్టు కొమ్మల్లోకి సంతోషంగా చేరుకుంది. చూసారుగా తమతోటి కాకి ఆపదలో ఉంటే దాన్ని కాపాడమని తమ భాషలో అవి వేడుకున్న కాకుల ప్రేమతత్వం.
ఇలా ఇపుడు కాకిని కాపాడిన మధుసూదన్ లోకల్‌గా ఫేమస్ అయిపోయాడు. అయితే మనుషులు సైతం పక్కవారికి కష్టమొస్తే సాయం చేయటానికి అందరూ కలిసి ముందుకు వస్తే అన్యాయంగా ఎవరు బలై పోరు. సమాజంలో నివశిస్తున్నా ఒంటరి వారమనే దిగులూ ఎవరిలోనూ కనిపించదు.

Crows
రిపోర్టర్ : బి. రవి కుమార్, పశ్చిమగోదావరి జిల్లా
ఇవి కూడా చదవండి: CDS Gen Bipin Rawat: నేడు జనరల్ బిపిన్ రావత్ అంత్యక్రియలు.. హాజరుకానున్న శ్రీలంక, నేపాల్, భూటాన్ ఆర్మీఅధికారులు..
Home Remedies: చమటతో శరీరం నుంచి దుర్వాసన వస్తుందా..? ఇలా చేస్తే చక్కటి పరిష్కారం..