బిగ్ బ్రేకింగ్.. : తిరుమల కొండపైకి వాహనాల నిషేధం.. మెట్ల మార్గం కూడా..

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణాయలు తీసుకోొబోతోంది. ఇప్పటికే అలిపిరి చెక్ పోస్ట్ మూసివేసినట్లు సమాచారం. దీంతో చెక్ పోస్ట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మెట్ల మార్గం కూడా మూసివేయడంతో.. తిరుమల ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ముందు జాగ్రత్తల్లో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో కాసేపట్లో టీటీడీ బోర్డు సమావేశం కానుంది. కాగా.. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. […]

బిగ్ బ్రేకింగ్.. : తిరుమల కొండపైకి వాహనాల నిషేధం.. మెట్ల  మార్గం కూడా..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 19, 2020 | 3:35 PM

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణాయలు తీసుకోొబోతోంది. ఇప్పటికే అలిపిరి చెక్ పోస్ట్ మూసివేసినట్లు సమాచారం. దీంతో చెక్ పోస్ట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మెట్ల మార్గం కూడా మూసివేయడంతో.. తిరుమల ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ముందు జాగ్రత్తల్లో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో కాసేపట్లో టీటీడీ బోర్డు సమావేశం కానుంది.

కాగా.. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు 180 దాటిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇవాళ సాయంత్రం 8.00 గంటలకు కరోనా నేపథ్యంలో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.