Corona Cases AP: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే..!
Corona Cases AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 41,671 సాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 179 మందికి..
Corona Cases AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 41,671 సాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 179 మందికి కోవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,85,616కి చేరింది. అటు నిన్న ఒక్క రోజులో 219 మంది వైరస్ నుంచి కోలుకోవడంతో ఇప్పటిదాకా 8,76,140 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 2338 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 7138 మంది చనిపోయారు. నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 10, చిత్తూరు 51, తూర్పుగోదావరి 17, గుంటూరు 26, కడప 5, కృష్ణా 15, కర్నూలు 13, నెల్లూరు 8, ప్రకాశం 9, శ్రీకాకుళం 2, విశాఖపట్నం 9, విజయనగరం 9, పశ్చిమ గోదావరిలో 5 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
#COVIDUpdates: 14/01/2021, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,82,721 పాజిటివ్ కేసు లకు గాను *8,73,245 మంది డిశ్చార్జ్ కాగా *7,138 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,338#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/PPAirM3HGk
— ArogyaAndhra (@ArogyaAndhra) January 14, 2021