రైతన్నలను నట్టేటముంచిన కలాస్ కంపెనీ ఉల్లి విత్తనాలు, 5 వందల ఎకరాల్లో వేసిన పంట నిష్ప్రయోజనం, న్యాయం కోసం ఫిర్యాదు
కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామంలో రైతన్నలు భోరున విలపిస్తున్నారు. నకిలీ ఉల్లి విత్తనాల కంపెనీ నట్టేట..
కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామంలో రైతన్నలు భోరున విలపిస్తున్నారు. నకిలీ ఉల్లి విత్తనాల కంపెనీ నట్టేట ముంచిందని గగ్గోలు పెడుతున్నారు. కలాస్ కంపెనీ, తమకు నకిలీ ఉల్లి విత్తనాలు విక్రయించి, తమను అన్ని విధాలుగా నష్టపరిచిందని ఆందోళనకు దిగారు. సదరు కంపెనీ ఉల్లి విత్తనాలను వేసి దాదాపు 500 ఎకరాలలో పంట వేశామని, కానీ పంట సరిగా రాలేదని చెబుతున్నారు. ఎకరాకు లక్ష రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టామని పై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందన లేకపోవడంతో రైతులంతా కలిసి కోడుమూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కంపెనీ నుంచి నష్టపరిహారం కింద కనీసం 50 వేల రూపాయలు అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.