కుప్పంలో దొంగనోట్ల ముఠా గుట్టురట్టు! రూ.2.7 కోట్లు స్వాధీనం
కుప్పంలో భారీ దొంగ నోట్ల ముఠా పట్టుబడింది. కుప్పం మండలం సామగుట్టపల్లిలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ ఏజెంట్ల ద్వారా దొంగనోట్ల చలామణి చేస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరికి చెందిన ఇద్దరు, కుప్పం మండలం సామగుట్టపల్లి పల్లికి చెందిన ఇంటి యజమానితో పాటు తిరుపతికి చెందిన మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.లక్ష ఫేక్ కరెన్సీ చలామణి చేస్తే రూ.10వేలు కమీషన్ ఇస్తూ ఏజెంట్ల ద్వారా దొంగ నోట్ల చలామణి […]
కుప్పంలో భారీ దొంగ నోట్ల ముఠా పట్టుబడింది. కుప్పం మండలం సామగుట్టపల్లిలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ ఏజెంట్ల ద్వారా దొంగనోట్ల చలామణి చేస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరికి చెందిన ఇద్దరు, కుప్పం మండలం సామగుట్టపల్లి పల్లికి చెందిన ఇంటి యజమానితో పాటు తిరుపతికి చెందిన మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.లక్ష ఫేక్ కరెన్సీ చలామణి చేస్తే రూ.10వేలు కమీషన్ ఇస్తూ ఏజెంట్ల ద్వారా దొంగ నోట్ల చలామణి చేస్తున్నట్లు గుర్తించారు. పెద్ద నోట్ల రద్దు అయినప్పటి నుంచి ఈ దందా కొనసాగిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల వద్ద పోలీసులు రూ.2.7 కోట్ల దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నకిలీ కరెన్సీలో పాత వెయ్యి రూపాయల నోట్లతో పాటు రూ.2వేలు, రూ.500 నోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.