AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: అరకులోయలో ముగింపు దశకు చలి ఉత్సవాలు.. ఆకట్టుకుంటున్న ట్రెక్కింగ్, రంగోలి, షాడో డ్యాన్స్

ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకులోయలో మూడు రోజులుగా జరుగుతున్న చలి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఇవాళ ట్రెక్కింగ్, రంగోలి, షాడో డ్యాన్స్, ఫైర్ వర్క్స్‌ కార్యక్రమంతో చలి ఉత్సవాలకు ముగింపు పలకనున్నారు అధికారులు. చివరి రోజుతోపాటు.. సెలవు దినం కావడంతో అరకు లోయ చలి ఉత్సవాలను ఎంజాయ్‌ చేసేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు.

Watch: అరకులోయలో ముగింపు దశకు చలి ఉత్సవాలు.. ఆకట్టుకుంటున్న ట్రెక్కింగ్, రంగోలి, షాడో డ్యాన్స్
Araku
K Sammaiah
| Edited By: TV9 Telugu|

Updated on: Feb 03, 2025 | 3:39 PM

Share

ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకులోయలో మూడు రోజులుగా జరుగుతున్న చలి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఇవాళ ట్రెక్కింగ్, రంగోలి, షాడో డ్యాన్స్, ఫైర్ వర్క్స్‌ కార్యక్రమంతో చలి ఉత్సవాలకు ముగింపు పలకనున్నారు అధికారులు. చివరి రోజుతోపాటు.. సెలవు దినం కావడంతో అరకు లోయ చలి ఉత్సవాలను ఎంజాయ్‌ చేసేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ప్రధానంగా.. మాడగడ మేఘాల కొండకు సందర్శకులు క్యూ కట్టారు. దాంతో.. సన్ రైజ్ వ్యూ పాయింట్‌లో సందడి నెలకొంది.

స్వచ్ఛమైన చల్లని వాతావరణం.. ఆహ్లాదకరమైన ప్రకృతి సోయగాలు.. తెల్లతెల్లవారుతుండగా మంచు తెరలను చీల్చుకొని ఉదయించే భానుడి అందాలు.. మాడగడ సన్‌రైజ్ వ్యూ పాయింట్‌లోని సుందర దృశ్యాలు.. ఇలా ఎన్నో అందాలకు కేరాఫ్‌ అరకులోయ.. ఈ క్రమంలోనే.. అరకులోయలో చలి ఉత్సవ్ పేరుతో ఏపీ ప్రభుత్వం గత మూడు రోజుల నుంచి వేడుకలు నిర్వహిస్తోంది. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, నృత్యాలు, అడ్వెంచర్స్‌, ఫ్లవర్ షో, కార్నివాల్.. ఇలా మూడు రోజుల ఈవెంట్‌లో రకరకాల ప్రత్యేకతలతో కార్యక్రమాలు చేపట్టింది.

వివిధ రాష్ట్రాల కళాకారుల ప్రదర్శనలు, హాట్‌ ఎయిర్ బెలూన్ పారా గ్లైడింగ్‌ లాంటి అడ్వెంచర్స్, తొలిసారిగా హెలి రైడ్ అందుబాటులోకి తీసుకొచ్చారు. తొలిరోజు నిర్వహించిన గిరిజన కళాకారుల కార్నివాల్ కలర్‌ఫుల్‌గా సాగింది. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా చేపట్టిన కార్నివాల్‌లో జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్, ఐటీడీఏ పీవో అభిషేక్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా మారారు. కళాకారులతో కలిసి సాంప్రదాయ నృత్యాల్లో పాల్గొన్నారు. డోలు వాయించి సందడి చేశారు. ఐటీడీఏ పీవో అభిషేక్ సినిమా పాటలకు స్టెప్పులేసి అదరగొట్టారు. ఇలా.. గత రెండు రోజులుగా పర్యాటకుల్లో జోష్‌ పెంచిన చలి ఉత్సవాలు.. ఇవాళ ట్రెక్కింగ్, రంగోలి, షాడో డ్యాన్స్, ఫైర్ వర్క్స్‌ కార్యక్రమంతో ముగియబోతున్నాయి.

మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ