AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: వ్యర్దాలకు జీవం పోస్తున్న మహిళలు.. కొబ్బరి పీచుతో అందమైన అలంకరణ వస్తువులు.. చూస్తే వావ్ అనాల్సిందే..

అగ్గిపెట్టె సబ్బుబిళ్ళ కాదేది కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీ శ్రీ . సృజనాత్మకంగా అలోచించి కొంత నేర్పును ప్రదర్శిస్తే పనికిరావు అనుకున్న వాటిని, మరికాస్త సమయం కేటాయిస్తే అందమైన బొమ్మలను తయారు చేయవచ్చు. అలా పనికిరాదని భావించే కొబ్బరి కాయలతో, కొబ్బరి పీచుతో రకరకాల అలంకరణ వస్తువులు చేస్తున్నారు పాలకొల్లు వాసులు.

Andhra Pradesh: వ్యర్దాలకు జీవం పోస్తున్న మహిళలు.. కొబ్బరి పీచుతో అందమైన అలంకరణ వస్తువులు.. చూస్తే వావ్ అనాల్సిందే..
Coconut Husk Crafts
B Ravi Kumar
| Edited By: |

Updated on: Jul 13, 2025 | 11:22 AM

Share

ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ , కార్డు బోర్డ్స్ , ఆయిల్ క్యాన్స్ తో ఇంట్లో వాడుకునే వస్తువులు తయారు చేస్తునాటారు కొందరు. మరికొందరు తమ తెలివితేటలను ఆదాయ వనరుగాను మార్చుకుంటారు. ఎందుకంటే ఏ కళ అయినా పది మంది మెచ్చుకోవాలి , పది మందికి ఉపయోగపడాలి అపుడే దానికి ప్రయోజనం చేకూరుతుంది. ఆ కళాకారుడికి సైతం మంచి పేరు లభిస్తుంది. మన అందరి ఇళ్లలో కొబ్బరి కాయల నుంచి లభిస్తుంది. దాన్ని మనం పనికి రానిదిగా భావించి బయట పడేస్తాము . కానీ అల్లాంటి పీచుతో ఎన్నో అలంకరణ వస్తువులు తయారు చేయవచ్చని పాలకొల్లు ప్రాంతానికి చెందిన వ్యక్తులు భావించారు. పక్షుల గూళ్లు తయారు చేశారు.

దేవుళ్ళ ప్రతిమలు, ఇంటి నమూనాలకు ఊపిరి పోస్తున్నారు. కేవలం కొబ్బరి పీచు మాత్రమే కాదు వరికంకులతో ఇంటి గుమ్మానికి కట్టుకునే తోరణాలు , కుచ్చులు తయారు చేసి విక్రయిస్తున్నారు. పూర్వం మండువా లోగిళ్ళలో వారికుచ్చులు ఎక్కువగా కనిపించేవి. పక్షలు ఆహారం కోసం వచ్చి సందడి చేసేవి. ఇపుడు పల్లెలు సైతం కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న క్రమంలో వారికంకుల కుచ్చులు ధరించి వాటిని ఇంటికి కట్టాలని ఆసక్తి వున్నా పూర్వంలా వాటిని నేర్పుగా కట్టే వ్యక్తులు దొరకడంలేదు. అలాంటి వారికి మార్కెట్లో ఇవి అందుబాటులోకి రావటం పట్ల పక్షుల ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..