AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: వంటగది జిడ్డుగా, మురికిగా ఉందా.. ఈ టిప్స్ తో నిమిషాల్లో శుభ్రం చేసుకోండి

ఇంట్లో అన్ని గదులకెల్లా వంటగదికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఆ వంట గది ఇంటి సభ్యులకు ఆరోగ్యాన్ని ఇచ్చేది కూడా. కనుక వంట గదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వంటగదిలో పనిచేసే సమయంలో కుళాయి సహా అన్ని మురికిగా మారతాయి. లేదా క్రమంగా మొండి మరకలతో నేల జిగటగా కనిపించడం ప్రారంభమవుతుంది. అప్పుడు వంట గదిని శుభ్రం చేయడం అంటే ఒక పెద్ద పని అని చెప్పవచ్చు. ఈ నేపధ్యంలో వంట గదిలోని జిడ్డుని సింపుల్ టిప్స్ తో తొలగించవచ్చు.

Kitchen Hacks: వంటగది జిడ్డుగా, మురికిగా ఉందా.. ఈ టిప్స్ తో నిమిషాల్లో శుభ్రం చేసుకోండి
Kitchen Hacks
Surya Kala
|

Updated on: Jul 13, 2025 | 11:07 AM

Share

ఇంట్లో వంటగది అత్యంత ముఖ్యమైన ప్రదేశం. ఇది మొత్తం కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించినది. ఇక్కడ మురికి ఉంటే, బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇంట్లో సభ్యులను అనారోగ్యానికి గురి చేస్తుంది. అయితే, ప్రతి ఒక్కరూ తమ వంటగదిని పూర్తిగా శుభ్రంగా ఉంచడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మంది మహిళలు ఇంటి పనులు చేసుకుంటూ వంటగదిలోనే ఎక్కువ సమయం గడుపుతారు. ఆధునిక కాలంలో అనేక రకాల కిచెన్ గాడ్జెట్‌లు రావడంతో వంట చేయడం చాలా సులభం అయింది. అయితే వంటగదిలో ఆహారం వండడమే కాదు ఆ తర్వాత వంట ఇంట గదిని శుభ్రం చేసుకోవాలి. అదొక పెద్ద పనిగా మహిళలు భావిస్తారు. అప్పుడు వంట గదిలోని జిడ్డుని తొలగించేందుకు డిటర్జెంట్ పౌడర్ వేసి మరీ గంటల తరబడి స్క్రబ్ చేస్తారు. అయితే వంట గదిలో పేరుకుపోయిన మురికిని శుభ్రం చేయడంలో చాలా ప్రభావవంతంగా పని చేసే సింపుల్ హక్స్ ఉన్నాయి.

వంట చేసే సమయంలో వస్తువులు అక్కడక్కడ పడిపోతాయి. ముఖ్యంగా మసాలాలు, నూనె ఎక్కడైనా చిందినట్లయితే వాటి మరకలు జిడ్డుగా మారాయి. దీంతో శుభ్రం చేయడం చాలా ఇబ్బందికరంగా మారుతుంది. జిడ్డుగా ఉన్న చోట కీటకాలు, కంటికి కనిపించని బ్యాక్టీరియా కూడా చోటు చేసుకుంటాయి. వంటగదిలోని జిగట నేల లేదా కుక్ టాప్ స్లాబ్‌ను శుభ్రం చేయడంలో చాలా ఉపయోగకరంగా ఉండే కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.

నిమ్మకాయ, వెనిగర్ వంటగదిలో నిమ్మకాయ సులభంగా లభిస్తుంది. అయితే కొన్ని ఇళ్లలో వెనిగర్ కూడా ఉంటుంది. ఈ రెండింటి కలయిక వంటగదిలో లేదా ఇంట్లో ఎక్కడైనా నేలను శుభ్రం చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మురికిని మాత్రమే కాదు బ్యాక్టీరియాను కూడా తొలగిస్తుంది. నిమ్మరసం, వెనిగర్‌ను స్ప్రే బాటిల్‌లో నింపి, మరకలు లేదా జిగట ఉన్న చోట పోసి కొన్ని నిమిషాలు అలాగే ఉంచండి. ఇది మురికిని త్వరగా శుభ్రం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

బేకింగ్ సోడా బేకింగ్ సోడా ఇళ్లలో కూడా సులభంగా లభిస్తుంది. వంటగది శుభ్రపరచడానికి ఇది ఒక అద్భుతమైన పదార్థం, ముఖ్యంగా జిడ్డును తొలగించాలనుకుంటే దీనిని ఉపయోగించడం మంచిది. సింక్‌లు, డ్రెయిన్‌లను శుభ్రం చేయడంలో కూడా ఇది ప్రభావవంతంగా ఉంటుంది. దీని కోసం బేకింగ్ సోడాలో నిమ్మకాయ, ఉప్పు వేసి, కొద్దిగా నీరు కలిపి పేస్ట్ గా చేయండి. ఇది మరకలను శుభ్రపరుస్తుంది. జిడ్డును కూడా తొలగిస్తుంది. వేడి నీటిలో ఈ మూడు పదార్థాలను కలిపి ఆ నీటిలో డ్రెయిన్‌ను సులభంగా శుభ్రం చేయవచ్చు.

అమ్మోనియా ఒక అద్భుతమైన క్లీనర్ ఇంట్లోని వస్తువులతో వంట గదిలోని జిడ్డుని తొలగించడం ఇబ్బందిగా భావిస్తే.. మార్కెట్లో సులభంగా లభించే అమ్మోనియాను కొనుగోలు చేయవచ్చు. ఒక కప్పు అమ్మోనియాను ఒక బకెట్ నీటిలో కలిపి, ఈ ద్రావణంతో నేలను, కిచెన్ స్లాబ్‌ను శుభ్రం చేయండి. దీంతో వంటగది కొన్ని నిమిషాల్లో మెరుస్తుంది. అయితే అమ్మోనియా నీటితో వంట గదిని శుభ్రం చేస్తున్నప్పుడు, కిటికీలు, తలుపులు తెరిచి ఉండాలి. ఫేస్ మాస్క్ ఉపయోగించండి. ఎందుకంటే దీని వాసన చాలా బలంగా ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

కిరాక్ మామ.. కిరాక్.. 10 సెకన్లలో పిల్లిని కనిపెడితే మీరు తోపులే
కిరాక్ మామ.. కిరాక్.. 10 సెకన్లలో పిల్లిని కనిపెడితే మీరు తోపులే
ఇండిగో సంక్షోభం.. ఎయిరిండియా నుంచి కీలక ప్రకటన
ఇండిగో సంక్షోభం.. ఎయిరిండియా నుంచి కీలక ప్రకటన
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే వెంటనే ఉపశమనం
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే వెంటనే ఉపశమనం
తిరుమల శ్రీవారికి 100 కోట్ల ఆస్తిని ఇచ్చేసిన టాలీవుడ్ నటి..
తిరుమల శ్రీవారికి 100 కోట్ల ఆస్తిని ఇచ్చేసిన టాలీవుడ్ నటి..
ఒక్క కార్డుతో బస్సులో రాయితీ, ట్రైన్స్‌లో బెర్త్.. ఎలా పొందాలంటే
ఒక్క కార్డుతో బస్సులో రాయితీ, ట్రైన్స్‌లో బెర్త్.. ఎలా పొందాలంటే
హైదరాబాద్ చేరువలోనే వైజాగ్.. 3 గంటలే జర్నీ.. ఒక్కరోజు ట్రిప్‎కి..
హైదరాబాద్ చేరువలోనే వైజాగ్.. 3 గంటలే జర్నీ.. ఒక్కరోజు ట్రిప్‎కి..
ప్రతి నెలా రూ.16 వేల పెట్టుబడితో రూ.1 కోటి సొంతం చేసుకోవచ్చా..?
ప్రతి నెలా రూ.16 వేల పెట్టుబడితో రూ.1 కోటి సొంతం చేసుకోవచ్చా..?
సడన్‌గా రిటైర్మెంట్ ప్రకటించిన తలపొగరోడు..
సడన్‌గా రిటైర్మెంట్ ప్రకటించిన తలపొగరోడు..
ఈ 5 రాశులవారికి పండుగలంటే పిచ్చి.. వారి ఎంజాయ్‎మెంట్..
ఈ 5 రాశులవారికి పండుగలంటే పిచ్చి.. వారి ఎంజాయ్‎మెంట్..
రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్‌న్యూస్.. జనవరి నుంచి అవి ఫ్రీ
రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్‌న్యూస్.. జనవరి నుంచి అవి ఫ్రీ