AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stay Sharp: వయసుతో పనిలేదు.. ఈ 10 టిప్స్ పాటిస్తే మీ బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది..

మీరు ఎప్పటికీ చురుగ్గా ఉండాలని అనుకుంటున్నారా? మీ మెదడును యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం సాధ్యమే. కొన్ని సాధారణ అలవాట్లు మన జ్ఞాపకశక్తిని, ఆలోచనలను మెరుగుపరుస్తాయి. రోజంతా చురుగ్గా ఉండేలా చేస్తాయి. మీ మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వయసుతో సంబంధం లేకుండా మీ మెదడును ఎప్పుడూ యువ్వనంగా, షార్ప్ గా ఉంచే ఆ పది రహస్యాలు ఇవిగోండి.

Stay Sharp: వయసుతో పనిలేదు.. ఈ 10 టిప్స్ పాటిస్తే మీ బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది..
Brain Health 10 Secrets
Bhavani
|

Updated on: Jul 12, 2025 | 7:45 PM

Share

మీరు ఎప్పటికీ చురుగ్గా ఉండాలని అనుకుంటున్నారా? మీ మెదడును యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం సాధ్యమే. కొన్ని సాధారణ అలవాట్లు మన జ్ఞాపకశక్తిని, ఆలోచనలను మెరుగుపరుస్తాయి. మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మెదడును ఎప్పుడూ యువంగా ఉంచే ఆ పది రహస్యాలు ఇవిగోండి.

ఆరోగ్యకరమైన అలవాట్లతో చురుకైన మెదడు

నిరంతరం నేర్చుకోండి: కొత్త అలవాట్లు నేర్చుకోండి. పజిల్స్ పరిష్కరించండి. ఆన్‌లైన్ కోర్సులలో చేరండి. వర్క్‌షాప్‌లకు వెళ్ళండి. ఇవన్నీ మెదడుకు ఉత్సాహం ఇస్తాయి.

క్రమం తప్పక వ్యాయామం చేయండి: శారీరక శ్రమ మెదడుకు రక్త ప్రసరణ పెంచుతుంది. జ్ఞాపకశక్తి తగ్గకుండా చూస్తుంది.

మెదడుకు మేలు చేసే ఆహారం తినండి: ఆకుకూరలు, బెర్రీలు, నట్స్, ఒమేగా-3 ఉండే చేపలు, తృణధాన్యాలు మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి.

నాణ్యమైన నిద్ర ముఖ్యం: రోజుకు 7-8 గంటలు అంతరాయం లేని నిద్ర అవసరం. ఇది మెదడులోని విష పదార్థాలను తొలగించి, జ్ఞాపకశక్తి పెంచుతుంది.

ఒత్తిడిని నియంత్రించండి: దీర్ఘకాలిక ఒత్తిడి మెదడు కణాలకు హాని చేస్తుంది. యోగా, ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు, మైండ్‌ఫుల్ వాకింగ్ వంటివి చేయండి.

సామాజికంగా కలవండి: స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఉండండి. ఇది మీ మనసును పదును పెడుతుంది. ఆలోచనా శక్తి తగ్గకుండా చూస్తుంది.

సిగరెట్లు, అతిగా మద్యం వద్దు: ఈ రెండూ మెదడుకు చాలా ప్రమాదకరం. వీటి వల్ల మతిమరుపు రావచ్చు.

నీరు బాగా తాగండి: డీహైడ్రేషన్ మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది. రోజు తగినంత నీరు తాగడం ముఖ్యం.

తల రక్షించుకోండి: తలకు గాయాలు అయితే దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి సమస్యలు, తీవ్రమైన ఇబ్బందులు రావచ్చు. అందుకే, డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించి మీ తలను కాపాడుకోండి.

ఈ అలవాట్లను మీ దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే, మీ మెదడును దీర్ఘకాలం పాటు చురుగ్గా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.