AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Jagan: సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ యాత్రకు భారీ రెస్పాన్స్.. మదనపల్లెలో ప్రసంగంపై ఉత్కంఠ..

ఏపీలో వైసీపీ అధినేత, సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర ఉమ్మడి చిత్తూరు కొనసాగుతుంది. మేమంతా సిద్ధం బస్సుయాత్రకు ప్రజల నుంచి భారీగా స్పందన లభిస్తుంది. దారి పోడవునా గజమాలలతో ఘనస్వాగతం పలుకున్నారు ప్రజలు. బస్సుయాత్ర ద్వారా ప్రజలతో సీఎం జగన్ మమేకమవుతున్నారు. జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర నేటికి (మంగళవారం) 6వ రోజుకి చేరుకుంది.

YS Jagan: సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ యాత్రకు భారీ రెస్పాన్స్.. మదనపల్లెలో ప్రసంగంపై ఉత్కంఠ..
Ys Jagan
Shaik Madar Saheb
|

Updated on: Apr 02, 2024 | 9:49 AM

Share

ఏపీలో వైసీపీ అధినేత, సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర ఉమ్మడి చిత్తూరు కొనసాగుతుంది. మేమంతా సిద్ధం బస్సుయాత్రకు ప్రజల నుంచి భారీగా స్పందన లభిస్తుంది. దారి పోడవునా గజమాలలతో ఘనస్వాగతం పలుకున్నారు ప్రజలు. బస్సుయాత్ర ద్వారా ప్రజలతో సీఎం జగన్ మమేకమవుతున్నారు. జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర నేటికి (మంగళవారం) 6వ రోజుకి చేరుకుంది. ఉదయం 9 గంటలకు చీకటిమనిపల్లె రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరుతారు. లకలచెరువు,పెదపాలెం మీదగా వేపురికోట, బుర్రకాయలకోట క్రాస్, గొల్లపల్లి, అంగళ్ళు చేరుకుంటారు. మధ్యాహ్నం అంగళ్ళు దాటిన తరువాత లంచ్‌ బ్రేక్ తీసుకుంటారు. అనంతరం సాయంత్రం 3.30 గంటలకి మదనపల్లె చేరుకుని టిప్పు సుల్తాన్ గ్రౌండ్ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సీఎం జగన్.

సభ తర్వాత నిమ్మనపల్లి క్రాస్, బోయకొండ క్రాస్, చౌడేపల్లి, సోమల మీదుగా అమ్మగారిపల్లె చేరుకుంటారు. రాత్రికి అమ్మగారి పల్లె శివారులో చేస్తారు. జనాల్లో మేమంతా సిద్ధం బస్సుయాత్రకు వస్తున్న రెస్పాన్స్‌కి కాలే ఎండను సైతం లెక్కచేయకుండా బస్సుపై నుంచి అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి. మధ్యమధ్యలో సామాన్య ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలను అడిగితెలుసుకుంటున్నారు. అక్కడిక్కడే వారి సమస్యలను పరిష్కారంచేస్తున్నారు. అలాగే వైసీపీలో చేరే నాయకులను బస్సుయాత్రలోనే కలిసి పార్టీ చేరికలను ప్రొత్సహిస్తున్నారు జగన్.

ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాలంటీర్లను వ్యవస్థపై ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో వైసీపీ, విపక్షాల మధ్య మాటల యుద్దం నెలకొంది. ఇవాళ్టి మదనపల్లె సభలో వలంటీర్ వ్యవస్థపై ఈసీతీసుకున్న నిర్ణయంపై జగన్ ఏవిధంగా స్పందిస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది.

వీడియో చూడండి..

ఇదిలాఉంటే.. నిన్న కదిరిలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు సీఎం జగన్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..