AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పెన్షన్ల చుట్టు తిరుగుతోన్న ఏపీ పాలిటిక్స్.. పెన్షన్ల పంపిణీపై ఏపీ సర్కార్ మార్గదర్శకాలు సిద్దం..

ఏపీ పాలిటిక్స్‌ సమ్మర్‌ హీట్‌ని మించి వేడెక్కిస్తున్నాయి. ఏ చిన్న అవకాశం దొరికినా రాజకీయ లబ్ది పొందేందుకు పార్టీలన్నీ తహతహలాడుతున్నాయి. ప్రస్తుత రాజకీయమంతా పెన్షన్ల చుట్టూ తిరుగుతోంది. ఎన్నికల కమిషన్ వాలంటీర్ల సేవలకు బ్రేక్‌ వేయడంతో రాజకీయ రంగు పులుముకుంది. కూటమి పార్టీల కారణంగానే పెన్షన్లు ఆలస్యం అవుతున్నాయని వైసీపీ.. నిధులే లేనప్పుడు పెన్షన్ ఎలా వేస్తారని విపక్షాలు రివర్స్ ఎటాక్ చేస్తున్నాయి.

Andhra Pradesh: పెన్షన్ల చుట్టు తిరుగుతోన్న ఏపీ పాలిటిక్స్.. పెన్షన్ల పంపిణీపై ఏపీ సర్కార్ మార్గదర్శకాలు సిద్దం..
Ap Pensions
Balaraju Goud
|

Updated on: Apr 02, 2024 | 10:18 AM

Share

ఏపీ పాలిటిక్స్‌ సమ్మర్‌ హీట్‌ని మించి వేడెక్కిస్తున్నాయి. ఏ చిన్న అవకాశం దొరికినా రాజకీయ లబ్ది పొందేందుకు పార్టీలన్నీ తహతహలాడుతున్నాయి. ప్రస్తుత రాజకీయమంతా పెన్షన్ల చుట్టూ తిరుగుతోంది. ఎన్నికల కమిషన్ వాలంటీర్ల సేవలకు బ్రేక్‌ వేయడంతో రాజకీయ రంగు పులుముకుంది. కూటమి పార్టీల కారణంగానే పెన్షన్లు ఆలస్యం అవుతున్నాయని వైసీపీ.. నిధులే లేనప్పుడు పెన్షన్ ఎలా వేస్తారని విపక్షాలు రివర్స్ ఎటాక్ చేస్తున్నాయి.

పెన్షన్ల పంపిణీ అంశంపై ఏపీ వ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. సెర్ప్ జారీ చేసిన సర్కులర్​ అధికార పార్టీకి అనుకూలంగా ఉందని ఆరోపిస్తున్నాయి. పెన్షన్ల పంపిణీపై సెర్ప్ జారీ చేసిన సర్కులర్‌​కు వ్యతిరేకంగా తమ గళం విప్పుతున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు పెన్షన్ పంపిణీ పేరుతో వైసీపీ రాజకీయం చేస్తుందని ఆరోపించాయి. ఈ క్రమంలో సీఎస్ జవహార్ రెడ్డి జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. పెన్షన్ పంపిణీపై అనుసరించాల్సిన విధానాలను చర్చించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ చేయాలని నిర్ణయిస్తే అక్కడ టెంట్లు, తాగు నీటి సౌకర్యం కల్పించాలని కలెక్టర్లు కోరారు. పెన్షన్ల పంపిణీపై మార్గదర్శకాలు సిద్దం చేస్తామన్నారు సీఎస్‌ జవహర్ రెడ్డి.

పెన్షన్ల పంపిణీ పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. ఒకప్పుడు వలంటీర్ల వ్యవస్థను విచ్చిన్నం చేయాలనుకున్న పార్టీలు ఇప్పుడు ప్రశంసిస్తూ మాట్లాడటం సిగ్గుచేటు అని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. పెన్షన్లు ఒక్కరోజులో ఇవ్వకుంటే ఎందుకీ ప్రభుత్వం అని జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ప్రశ్నించారు. మరోవైపు వలంటీర్లు రాజీనామాలు కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా 600మందికి పైగా పదవుల్ని వదిలేశారు. మచిలీపట్నంలో వలంటీర్ల రాజీనామాలు అన్నింటిని పరిశీలిస్తున్నామని, ఆ తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు నగర పాలక సంస్థ కమిషనర్ బాపిరాజు.

వలంటీర్లను ఈసీ తప్పించిన కారణంగానే పెన్షన్ల పంపిణీ ఆలస్యం అవుతుందని.. టీడీపీ, జనసేన ఇలాంటి పరిస్థితి వచ్చిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఎన్నికల్లో వాళ్లకి బుద్ది చెప్పాలంటోంది. అయితే వలంటీర్లను సొంత ప్రయోజనాలకు వాడుకోవడం వల్లే ఈసీ వేటు వేసిందని విపక్షాలు ఎదురుదాడికి దిగుతున్నాయి. ఫైనల్‌గా పెన్షన్ల ఎపిసోడ్‌ని ఎవరికి వారే తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…