AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: బ్లేడ్లతో దాడి చేస్తున్నారు.. పిఠాపురంలో పవన్‌ కల్యాణ్ సంచలన ఆరోపణలు..

పవన్‌ కల్యాణ్‌ మీద దాడులు జరుగుతున్నాయా? కిరాయి మూకలు గుంపులో కలిసిపోయి పవన్‌, ఆయన సెక్యూరిటీ సిబ్బందే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నాయా? పవన్‌ లేటెస్ట్ ఆరోపణలకు అర్థం ఏంటి?.. అనేది ఏపీ పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Pawan Kalyan: బ్లేడ్లతో దాడి చేస్తున్నారు.. పిఠాపురంలో పవన్‌ కల్యాణ్ సంచలన ఆరోపణలు..
Pawan Kalyan
Shaik Madar Saheb
|

Updated on: Apr 02, 2024 | 9:50 AM

Share

పవన్‌ కల్యాణ్‌ మీద దాడులు జరుగుతున్నాయా? కిరాయి మూకలు గుంపులో కలిసిపోయి పవన్‌, ఆయన సెక్యూరిటీ సిబ్బందే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నాయా? పవన్‌ లేటెస్ట్ ఆరోపణలకు అర్థం ఏంటి?.. అనేది ఏపీ పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌.. ఎక్కడకు వెళ్లినా జనం తండోపతండాలుగా వస్తారు. ఆయన సభలకు అభిమానులు భారీగా తరలి వస్తారు. పవన్‌ని ముట్టుకోవాలని, ఆయనతో కరచాలనం చేయాలని, సెల్ఫీలు దిగాలని నానా ప్రయత్నాలు చేస్తుంటారు.

దాడులకు తెగబడుతున్నారా?

అయితే ఇలా అభిమానులు వచ్చి మీద పడిపోవడమే పవన్‌కి డేంజర్‌గా మారిందా? అభిమానుల ముసుగులో అరాచక శక్తులు పవన్‌పై దాడులకు తెగబడుతున్నాయా? ఆయనతో పాటు ఆయన భద్రతా సిబ్బందిని కూడా వాళ్లు టార్గెట్‌ చేశారా? పవన్‌ ఆరోపణలకు అర్థం ఇదేనా? అంటే.. అవునంటున్నారు పవన్‌. కాకినాడలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కలిసేవారిలో కిరాయి మూకలు ఉన్నాయంటున్నారు పవన్‌. తనపై, తన సెక్యూరిటీ సిబ్బందిపై బ్లేడ్లతో దాడులు చేస్తున్నారని ఆరోపించారు. అందుకే తప్పనిసరిగా ప్రొటోకాల్‌ పాటిస్తున్నానని, ప్రత్యర్థుల పన్నాగాలపై జాగ్రత్తగా ఉండాలని పార్టీ శ్రేణులను కోరారు.

వీడియో చూడండి..

అయినా తనను కలిసేవారితో ఫొటోలు దిగడానికి తాను సిద్ధం అంటున్నారు పవన్‌.. అయితే, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పవన్‌ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..