AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rythu Bharosa: రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు.. విడుదల చేసిన సీఎం జగన్..

రైతుభరోసా నిధులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. రైతుభరోసా- పీఎం కిసాన్‌ కింద మూడోవిడత పెట్టుబడి సాయం జమ నిధులు మొత్తం 50,58,489 మందికి రూ.1,036 కోట్లు జమ చేశారు.

Rythu Bharosa: రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు.. విడుదల చేసిన సీఎం జగన్..
Sanjay Kasula
|

Updated on: Jan 03, 2022 | 10:50 AM

Share

రైతుభరోసా నిధులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. రైతుభరోసా- పీఎం కిసాన్‌ కింద మూడోవిడత పెట్టుబడి సాయం జమ నిధులు మొత్తం 50,58,489 మందికి రూ.1,036 కోట్లు జమ చేశారు. సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి ఈ మొత్తాన్ని రైతు భరోసా సాయాన్ని బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ మొత్తంతో కలిపి 2021–22 సీజన్‌లో రూ.6,899.67 కోట్లు జమ కానుండగా, గడిచిన మూడేళ్లలో ఈ పథకం కింద రూ.19,812.79 కోట్లు పెట్టుబడి సాయం అందిస్తోంది. వైఎస్సార్‌ రైతుభరోసా–పీఎం కిసాన్‌ కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోంది.

వైసీపీ ఎన్నికల హామీలో భాగంగా రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ. 13,500 సాయం విడతల వారీగా అందిస్తోంది. ఇందులో మొదటి విడతగా ఖరీఫ్‌ పంట వేసే ముందు అంటే మే నెలలో రూ. 7,500, రెండవ విడతగా అక్టోబర్‌ నెల ముగిసేలోపే ఖరీఫ్‌ పంట కోత సమయం, రబీ అవసరాల కోసం రూ. 4,000, మూడవ విడతగా ధాన్యం ఇంటికి చేరే సంక్రాంతి వేళ జనవరి నెలలో రూ. 2,000 చొప్పున ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తోంది.

2019 అక్టోబర్‌ 15న శ్రీకారం చుట్టిన ఈ పథకం కింద తొలి ఏడాది 45 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,162.45 కోట్లు జమచేశారు. ఈ మొత్తంలో పీఎం కిసాన్‌ కింద రూ.2,525 కోట్లు కేంద్రం, వైఎస్సార్‌ రైతుభరోసా కింద రూ.3,637.45 కోట్లు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం భరించాయి. ఇక రెండో ఏడాది 2020–21లో 49.40 లక్షల రైతు కుటుంబా లకు రూ.6,750.67 కోట్లు జమచేశారు. ఇందులో వైఎస్సార్‌ రైతుభరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.3,784.67 కోట్లు జమచేయగా, పీఎం కిసాన్‌ కింద రూ.2,966 కోట్లు కేంద్రం అందించింది.

ఇవి కూడా చదవండి: Curry Leaf: అమ్మో..! కరివేపాకు కిలో రూ. 175.. గ్రేటర్‌లో చుక్కలు చూపిస్తున్న ధర..

Viral Video: కుందేలపై మరోసారి గెలిచిన తాబేలు.. ఇది కథకాదు నిజం.. వీడియో చూస్తే మీరూ అదే అంటారు..