AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Jagan: ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శక పాలన అందిస్తున్నాం.. సీఎం జగన్ పవర్‌ఫుల్ స్పీచ్..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోధులందరికీ.. ఆప్తుడిగా, కుటుంబ సభ్యులందరికీ సెల్యూట్ చేస్తున్నానని సీఎం జగన్ పేర్కొన్నారు. పార్టీ ప్రారంభం అయిన తర్వాత 13 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు.

YS Jagan: ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శక పాలన అందిస్తున్నాం.. సీఎం జగన్ పవర్‌ఫుల్ స్పీచ్..
Ysrcp
Shaik Madar Saheb
|

Updated on: Jul 08, 2022 | 12:45 PM

Share

YSRCP Plenary 2022: ఓదార్పు యాత్రతో ప్రారంభమైన ఈ సంఘర్షణ వైఎస్ఆర్‌సీపీ పార్టీగా అవతరించిందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ ఆశయ సాధనలో ఎన్నో అవమానాల్ని, కష్టాలను భరించి తనతో అండగా ఉన్న అందరికీ సీఎం కృతజ్నతలు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోధులందరికీ.. ఆప్తుడిగా, కుటుంబ సభ్యులందరికీ సెల్యూట్ చేస్తున్నానని సీఎం జగన్ పేర్కొన్నారు. పార్టీ ప్రారంభం అయిన తర్వాత 13 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదంతో 2019లో అధికారం చేపట్టినట్లు తెలిపారు. 175 స్థానాల్లో 151 మందితో అధికారం చేపట్టినట్లు తెలిపారు. చరిత్రలో కనీవినీఎరుగని రీతిలో ఆశీర్వదించారిని పేర్కొన్నారు. తమను ఇబ్బందులకు గురిచేసిన వారిని 3 ఎంపీ సీట్లు 23 అసెంబ్లీ సీట్లకు పరిమితం చేశారని పేర్కొన్నారు.

అధికారం అంటే అహంకారం కాదు.. ప్రజలందరి మమకారమని సీఎం జగన్ పేర్కొన్నారు. కష్టసుఖాల్లో ఈ జగమంత కుంటుంబం తన చేయి వీడలేదంటూ సీఎం పేర్కొన్నారు. వైఎస్ఆర్‌సీపీ మేనిఫెస్టోను భగవద్గీతలా, బైబిల్‌, ఖురాన్ లా భావించామని సీఎం పేర్కొన్నారు. దీంతో తమ మేనిఫెస్టోను చూడటానికే టీడీపీ భయపడిందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శక పాలన అందిస్తున్నామని పేర్కొన్నారు. అవినీతి, వివక్ష లేకుండా మూడేళ్ల పాలన చూపించామన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 95 శాతం నేరవేర్చామని జగన్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి