కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి ఉదయం 11.15కు కడప ఎయిర్‌పోర్టుకి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో బయల్దేరి 11.40కి అమీన్‌పీర్ దర్గాకు చేరుకుంటారు. అక్కడ ప్రార్థనలు నిర్వహించనున్నారు. అనంతరం నగర శివార్లలోని మాధవి కన్వెన్షన్ సెంటరులో ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లిఖార్జున్‌రెడ్డి కుమార్తె రిసెప్షన్‌కు హాజరు అవుతారు సీఎం జగన్. ఈ నేపథ్యంలో దాదాపు 2000 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ జాగిలాలు, బాంబు స్క్వాడ్, మెటల్ డిటెక్టివ్ తదితర సిబ్బంది మొత్తం అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు ఎస్పీ సూచించారు. ఎలాంటి ఘటనలు జరగకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పేర్కొన్నారు. ఈ మేరకు దర్గాలో ఏర్పాట్లను ఎస్పీ స్వయంగా పర్యవేక్షించారు.
అయితే.. ఉదయం 10.00 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం, 11.15 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. 11.40 – 12.10 వరకు కడప అమీన్ పీర్ దర్గాలో జరగనున్న పెద్ద ఉర్సు ఉత్సవాలలో పాల్గొంటారు. 12.25 – 12.45 కడప మాధవి కన్వెన్షన్ సెంటర్‌లో ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లిఖార్జునరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి 2.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
మరిన్ని ఏపీ న్యూస్ కోసం