AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: సీఎం జగన్ విదేశీ ప‌ర్య‌ట‌న ఖరారు.. మంగళవారం కుటుంబ సమేతంగా ప్యారిస్‌కు..

నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వైఎస్ జగన్ ఈ నెల 28న ఫ్రాన్స్‌కు వెళ్తున్నారు. తన పెద్ద కుమార్తె హర్ష.. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్‌సీడ్‌ బిజినెస్‌ స్కూల్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌(ఎంబీఏ) పూర్తి చేసుకోవడంతో..

CM Jagan: సీఎం జగన్ విదేశీ ప‌ర్య‌ట‌న ఖరారు.. మంగళవారం కుటుంబ సమేతంగా ప్యారిస్‌కు..
Cm Jagan
Sanjay Kasula
|

Updated on: Jun 27, 2022 | 9:35 PM

Share

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెస్ జగన్మోహన్ రెడ్డి(CM Jagan) విదేశీ ప‌ర్య‌ట‌న ఖరారైంది. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వైఎస్ జగన్ ఈ నెల 28న ఫ్రాన్స్‌కు వెళ్తున్నారు. తన పెద్ద కుమార్తె హర్ష.. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్‌సీడ్‌ బిజినెస్‌ స్కూల్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌(ఎంబీఏ) పూర్తి చేసుకోవడంతో.. గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలో పాల్గొనడానికి వెళ్తున్నారు. ఈ ప‌ర్య‌ట‌న కోసం రేపు (మంగ‌ళ‌వారం) రాత్రి 7.30 గంట‌ల‌కు గ‌న్న‌వ‌రం నుంచి బ‌య‌లుదేర‌నున్న జ‌గ‌న్ పారిస్‌లో వ‌చ్చే నెల 2వ తేదీ వ‌ర‌కు ప‌ర్య‌టించ‌నున్నారు. 28న రాత్రి బయలుదేరనున్న సీఎం జగన్‌.. 29న ప్యారిస్‌కు చేరుకుంటారు. కుమార్తె గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలో పాల్గొన్న తర్వాత.. జులై 2న తిరుగు ప్రయాణం అవుతారు. ఆ తర్వాత జులై 3న ఆయ‌న తిరిగి తాడేప‌ల్లి చేరుకుంటారు.

ఫ్రాన్స్ రాజ‌ధాని పారిస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వాలంటూ జ‌గ‌న్ ఇటీవ‌లే పిటిష‌న్ దాఖలు చేయ‌గా… నాంప‌ల్లిలోని సీబీఐ కోర్టు అందుకు అనుమ‌తిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఏపీ వార్తల కోసం..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..