AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: రాజధాని అంశంపై అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన…

రాజధానుల అంశంపై సీఎం జగన్‌ కీలక ప్రకటన చేశారు. ఏ పరిస్థితుల్లో 3 రాజధానులు తీసుకువచ్చామో బుగ్గన వివరించారని పేర్కొన్నారు.

CM Jagan: రాజధాని అంశంపై అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన...
Cm Jagan
Ram Naramaneni
|

Updated on: Nov 22, 2021 | 3:46 PM

Share

రాజధానుల అంశంపై సీఎం జగన్‌ కీలక ప్రకటన చేశారు. ఏ పరిస్థితుల్లో 3 రాజధానులు తీసుకువచ్చామో బుగ్గన వివరించారని పేర్కొన్నారు. ఈ ప్రాంతం అంటే తనకు ప్రేమ ఉందన్నారు సీఎం జగన్. అమరావతి అంటే ఎటువంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. తన ఇల్లు కూడా అమరావతిలో ఉందని చెప్పారు. రాష్ట్రమంతా అభివృద్ది చెందాలన్నదే తన తాపత్రయమన్నారు. రాష్ట్రంలో అతి పెద్ద నగరం విశాఖ అని చెప్పారు. అక్కడ అన్ని మౌళిక సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. ఇంకొన్ని జమ చేస్తే.. వైజాగ్‌.. హైదరాబాద్ వంటి పెద్ద నగరాలతో పోటీ పడే పరిస్థితి ఉంటుందన్నారు. వాస్తవాలను గుర్తెరిగే.. అన్ని ప్రాంతాల అభివృద్ది గురించి 3 రాజధానులు బిల్లును తీసుకొచ్చామని జగన్ చెప్పారు. రాజధాని ప్రాంతం అటు గుంటూరు, విజయవాడలో లేదన్నారు. అమరావతిలో రోడ్లు, డ్రెయినేజీలు, కరెంటు వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి రూ.లక్ష కోట్లు అవుతాయని గత ప్రభుత్వం చెప్పిందన్నారు. ఈ రోజు అయ్యే రూ.లక్ష కోట్ల ఖర్చు పదేళ్ల తర్వాత 6,7 లక్షల కోట్లు అవుతుందన్నారు. కనీస సౌకర్యాలు కల్పించేందుకు కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే.. రాజధాని నిర్మించడం సాధ్యమవుతుందా అని జగన్ సూటిగా ప్రశ్నించారు. అప్పట్లో అన్ని నివేదికలను ఉల్లంఘించి గత ప్రభుత్వంలో చంద్రబాబు రాజధానిని ఏర్పాటు చేశారని విమర్శించారు.  అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని.. రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపియల్ పెట్టాలని.. అమరావతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చందుకు శాసన రాజధాని ఏర్పాటు చేయాలని.. కర్నూలు ప్రజల ఆకాంక్షలను గుర్తించి న్యాయరాజధాని ఏర్పాటు చేసి అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలనే తపనతో మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్లు జగన్ వెల్లడించారు.  వికేంద్రీకరణకు సంబంధించి అనేక అపోహలు, అనుమానాలు, కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాలనే ప్రచారం చేశారని జగన్ అన్నారు.

బిల్లు ఆమోదం పొందిన వెంటనే.. ప్రక్రియ ప్రారంభమై ఉంటే..  అడ్డంకులు లేకుండా ముందుకు వెళ్తే.. ఇప్పటికి ఫలాలు అందుతూ ఉండేవని సీఎం చెప్పారు. కానీ  ఆ పరిస్థితుల లేనందున 3 రాజధానులపై.. సమగ్రమైన బిల్లును తీసుకొస్తామన్నారు. ఇంతకు ముందు బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు.  విసృత, విశాల ప్రజా ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయమన్నారు. చట్ట, న్యాయపరంగా అందరికీ సమాధానాలు చెప్పే విధంగా మళ్లీ సమగ్రమైన బిల్లును తీసుకొస్తామన్నారు. బిల్లులోని సదుద్దేశం అందరికీ వివరిస్తామన్నారు. ఇంకా ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే చేస్తామన్నారు.

Also Read: మైక్‌ టైసన్‌ గురించి సంచలన సీక్రెట్.. రింగ్‌లోకి దిగటానికి ముందు శృంగారం.. అదీ ఒకరిద్దరితో కాదు