Andhra Pradesh: గెట్ రెడీ బెజవాడ..గాంధీ హిల్‌పై లిఫ్ట్, ట్రైన్.. ఎప్పటినుంచి అందుబాటులోకి అంటే..?
విజయవాడలోని చారిత్రక గాంధీ హిల్‌కు కొత్త శోభ వచ్చింది! గాంధీ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు తొలిసారిగా ఈ కొండను సందర్శించనున్నారు. గాంధీ స్మారక స్థూపం వరకు సులువుగా చేరుకునేందుకు వీలుగా, నూతనంగా నిర్మించిన జంబో లిఫ్ట్ను, చిన్న ట్రైన్‌ను ఆయన ప్రారంభించనున్నారు.

విజయవాడ గాంధీ హిల్‌కు కొత్తకళ సంతరించుకుంది. గాంధీ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు తొలిసారిగా కొండపై పర్యటించి గాంధీ స్మారకస్థూపం నుండి బెజవాడ అందాలను వీక్షించనున్నారు. గాంధీ హిల్‌పై ఇప్పటికే భద్రత ఏర్పాటలను కట్టుదిట్టం చేశారు. గాంధీ హిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను చేపట్టారు. ఇప్పటికే అక్కడ నూతనంగా జంబో లెఫ్ట్‌ను నిర్మించారు. కొండ మిడిల్ డౌన్ నుండి స్మారకస్థూపం వరకు లిఫ్ట్ నిర్మించారు. విజయవాడ వ్యూ పాయింట్‌ను సందర్శించేలా ఏర్పాటు చేసిన నూతన లిఫ్ట్, ట్రైన్, పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
గాంధీ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు గాంధీ హిల్‌పై పర్యటించనున్నారు. తొలిసారిగా సీఎం చంద్రబాబు గాంధీ స్మారకస్థూపం సందర్శించనున్న ఈ నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఒక్కప్పుడు గాంధీ స్థూపం చేరుకోవాలంటే ఘాట్ రోడ్డులో వెళ్లాలి. కానీ అది కొండ పైవరకు లేదు. కొండ శిఖరాగ్రంలో ఉన్న గాంధీ స్మారకస్థూపం వరకు వెళ్లాలంటే మెట్ల మార్గం ఒక్కటే దిక్కు. అయితే పర్యాటకులకు ఇది ఇబ్బందిగా ఉందని గాంధీ హిల్ నిర్వాహుకులు జంబోలను నిర్మించారు.. చరిత్ర కలిగిన గాంధీ హిల్‌ను పూర్వవైభవం తీసుకొచ్చే ప్రణాళికలు చేస్తున్నారు..
విజయవాడ నగరం ఆధ్యాత్మికంగా, చారిత్మకంగా, సాంస్కృతికంగా ఎంతో గొప్ప ప్రాధాన్యత కలిగిన ప్రదేశం. ఇక్కడ ఒకవైపు ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ, మరోవైపు గుణదల మేరిమాత కొండ, గాంధీ కొండలు విశేష ఖ్యాతిని పొందాయి. వీటిలో అతి ముఖ్యమైనది గాంధీ హిల్, ఎన్నో ప్రత్యకతలతో నిలుస్తోంది. మహాత్మగాంధీ స్మారకార్ధంగా నిర్మించబడినన గాంధీ హిల్ కొండ దశాబ్దాలుగా లక్షలాది మంది సందర్శకులతో ఆకర్షిస్తుంది. మహాత్మగాంధీ మరణాతరం అయన జ్ణాపకార్ధం దేశవ్యాప్తంగా అనేక స్మారక చిహ్నాలు నిర్మించబడాయి. కానీ గాంధీ హిల్‌పై మహాత్మ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయకపోవడంతో ఈ క్రమంలో విజయవాడ రైల్వే స్టేషన్ పశ్చిమ ద్వారం సమీపంలో ఉన్న గాంధీ హిల్ కొండపై స్మారక స్థూపాన్నీ నిర్మించాలని ముమ్మర ఏర్పాటు చేపట్టారు..
1964 నవంబర్ 9న దీని నిర్మాణనికి శ్రీకారం చుట్టగా 1968లో గాంధీజీ శతజయంతి వేడుకలు సందర్భంగా నాటి భారత రాష్టపతి డా. జాకిర్ హుసేన్ చేతుల మీదుగా 52 అడుగుల ఎతైన స్మారక స్థూపాన్ని ప్రజలకు అంకితం చేశారు. అయితే అప్పటి నుంచి గాంధీ హిల్‌కు నగరంలో ప్రత్యక గుర్తింపు వచ్చింది. పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి గాంచిన గాంధీ హిల్ కొండపై భారీ లిఫ్ట్ సిద్ధమైంది. గాంధీ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించనున్నారు. కొండపై ఉన్న స్మారక స్థూపం వద్దకు సందర్శనకు సులువుగా చేరుకోవడానికి ఈ లిఫ్ట్ ఎంతగానో ఉపయోకపడనుంది. ప్రస్తుతం అక్కడకు చేరుకోవాలంటే కేవలం మెట్ల మార్గం మాత్రమే ఉంది.. సీఎం చంద్రబాబు పర్యటన తర్వాత ఈ లిఫ్ట్ శాశ్వతంగా అందరికి అందుబాటులోకి రానుంది. ప్రస్తతం లిఫ్ట్ నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




