Chandrababu: అమరావతిపై చంద్రబాబు సర్కార్ ఫుల్ ఫోకస్.. మొట్టమొదటి గ్యాస్ ఇన్సులెటెడ్ సబ్‌స్టేషన్‌ ప్రారంభం

రాజధాని ఎక్స్‌ప్రెస్‌కి గేర్లు మార్చేసింది ఏపీలో కూటమి సర్కార్. అమరావతికి కొత్త సొగసులద్దే యజ్ఞాన్ని మరింత వేగవంతం చేసింది. రాజధానికి నిరంతర వెలుగులు ప్రసాదించేలా.. తాళ్లయ్యపాలెంలో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. అటు.. అమరావతిలో ల్యాండ్‌ పూలింగ్ విషయంలో ఏర్పడ్డ సందిగ్ధతపై కూడా ఫోకస్ పెట్టి.. కొత్త యాక్షన్ ప్లాన్ షురూ చేసింది ఏపీ మున్సిపల్ మినిస్ట్రీ.

Chandrababu: అమరావతిపై చంద్రబాబు సర్కార్ ఫుల్ ఫోకస్.. మొట్టమొదటి గ్యాస్ ఇన్సులెటెడ్ సబ్‌స్టేషన్‌ ప్రారంభం
CM Chandrababu
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 07, 2024 | 10:15 PM

ఇప్పుడు అరడజనుకు అటూ ఇటూ మాత్రమే నిర్మాణాలున్న అమరావతి.. రాబోయే రోజుల్లో కొత్తకొత్త ఐకానిక్ బిల్డింగ్స్‌తో బిజీయెస్ట్ ప్లేస్‌గా మారబోతోంది. అందుకే.. దానికి తగ్గ మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టింది చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ సర్కార్.. ముఖ్యంగా అమరావతిలో విద్యుత్‌ సరఫరా విషయంలో కీలక చర్యలు చేపట్టింది. అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరానే లక్ష్యంగా 400/220 కేవీ గ్యాస్ ఇన్సులెటెడ్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు సీఎం చంద్రబాబు.

తాళ్లాయపాలెంలో ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రరప్రదేశ్‌ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ఈ GIS.. రాష్ట్రంలోనే మొట్టమొదటిది. అమరావతికి ఇప్పటివరకూ తాడికొండ సబ్‌స్టేషన్‌ నుంచి పవర్‌ సరఫరా అయ్యేది. కానీ.. అమరావతి విస్తరణ తర్వాత రాజధానిలోని అన్ని ప్రాంతాలకు డిమాండ్‌కు సరిపడా విద్యుత్ తాజాగా నిర్మించిన గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్‌ అందజేస్తుంది. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలతో పాటు గుంటూరు, ఎన్టీయార్ జిల్లాల్లోని పరిశ్రమల అవసరాలు కూడా తీరే ఛాన్సుంది.

తాళ్లాయపాలెం GISతో పాటు.. బేతంచర్ల, పెనుగొండ, గోరంట్ల, హంసవరం, మైలవరం.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 11 సబ్‌స్టేషన్లకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు. 6 వేల 98 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులన్నీ ఏడాదిలోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గడిచిన ఐదేళ్లలో అమరావతిని ఎడారిగా మార్చేశారని, ఇకపై నెంబర్ వన్ సిటీగా తయారుచేయడానికి కంకణం కట్టుకున్నామని చెప్పారు.

అటు.. మున్సిపల్ శాఖమంత్రి నారాయణ సైతం అమరావతి మీద ఫోకస్ పెట్టి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. గతంలో కొన్ని అనుమానాలు, భయాలతో కొందరు రైతులు ల్యాండ్‌పూలింగ్ విషయంలో వెనక్కు తగ్గారు. దీంతో రాజధాని డిజైనింగ్, నిర్మాణాలకు కొంతమేర ఇబ్బంది ఏర్పడింది. ఇప్పుడు మంత్రి నారాయణ స్వయంగా రంగంలో దిగి రైతుల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే విజయవాడలో రైతు అనుమోలు గాంధీ నివాసానికి వెళ్లారు. రాజధాని ఆవశ్యకతను, అందుకోసం ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. టోటల్‌గా అమరావతి 2.0ను స్పీడప్ చేయడానికి చంద్రబాబు అండ్ కో నాన్‌స్టాప్ ఎక్సర్‌సైజ్ కొనసాగుతోందన్నమాట..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..