రాజధానిపై నిలకడలేని మాటలు.. సున్నపురాళ్లపల్లె సభలో ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సున్నపురాళ్లపల్లె సభలో రాజధానిపై ప్రతిపక్ష నేత నిలకడలేని వైఖరిని తీవ్రంగా ఖండించారు. అమరావతి, మూడు రాజధానులు, విజయవాడ వంటి నిలకడలేని ప్రకటనలపై ఆయన ధ్వజమెత్తారు. తన విశ్వసనీయమైన రాజకీయాలతో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని, రాయలసీమలో అభివృద్ధి, ఉపాధి కల్పన తన లక్ష్యమని స్పష్టం చేశారు.

రాజధానిపై నిలకడలేని మాటలు మాట్లాడుతున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరోక్షంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై విమర్శలు కురిపించారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో రూ.16,350 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న ప్రతిష్ఠాత్మక జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ పనులను చంద్రబాబు ప్రారంభించారు. ఆ తర్వాత విజయనగరం జిల్లాలోని జిందాల్ పారిశ్రామిక పార్కును వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, వైసీపీపై కూడా ఆయన వ్యాఖ్యానించారు.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 2014లో రాష్ట్ర విభజన జరిగాక అమరావతిని రాజధానిగా అసెంబ్లీలో ఒప్పుకున్నారు. 2019లో అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు అన్నారు.. నాటకాలు ఆడారు. అధికారం పోయాక.. కేంద్రం చట్టం చేశాక మావిగన్ అన్నారు. నిన్న విజయవాడ రాజధాని అన్నారు.. రేపు ఏం అంటారో తెలీదు అని ఎద్దేవా చేశారు.
మతిస్థిమితం లేనివారితో రాజకీయం చేయడం ఎప్పుడూ చూడలేదు. నాది విశ్వసనీయైన రాజకీయం. ఒకమాటపై నిలబడితే చేసి చూపించే వ్యక్తిని కాబట్టే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. రాయలసీమలో ఫ్యాక్షన్ పోయింది. 1995లో నేను ముఖ్యమంత్రి అయ్యాక ఫ్యాక్షన్, ముఠాలు పోవాలని నిర్ణయించాను. సీమలో పారాల్సింది రక్తం కాదు…నీళ్లు పారాలి, సంసద సృష్టించాలని ముందుకెళ్లాను. నేడు ఫ్యాక్షన్ లేదు.. కానీ నేరాలు చేసే రాజకీయ నాయకులు ఉన్నారు. సొంత బాబాయిని చంపి.. నా చేతిలో కత్తిపెట్టి నేరం నాపై మోపి రాజకీయ లబ్ధి పొందారు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణలు గుప్పించారు.
వీడియో చూడండి
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
