AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Young man Fight: అవినీతి వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించిన చిత్తూరు యువకుడు

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో ఒక యువకుడు వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించడం మొదలుపెట్టాడు. ప్రభుత్వ భూములకు సంబంధించి జరుగుతోన్న అక్రమాలపై..

Young man Fight: అవినీతి వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించిన చిత్తూరు యువకుడు
Mani
Venkata Narayana
|

Updated on: Aug 07, 2021 | 2:08 PM

Share

Young man Fight – Corruption – Chittoor: చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో ఒక యువకుడు వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించడం మొదలుపెట్టాడు. ప్రభుత్వ భూములకు సంబంధించి జరుగుతోన్న అక్రమాలపై మణి అనే యువకుడు నిరాహారదీక్ష చేపట్టాడు. మండల తహశీల్దార్ కార్యాలయం ముందు 2 రోజులుగా దీక్ష చేస్తున్నాడు దాసరాపల్లి గ్రామానికి చెందిన మణి.

తమ దసరాపల్లి గ్రామానికి చెందిన చిన్న స్వామి రెడ్డి అనే వ్యక్తి 20 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసారని 10 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాడు. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌తో పాటు పలువురు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోదంటూ తన ఆవేదనను వెలిబుచ్చాడు. అధికారులు కబ్జాదారులతో కుమ్మక్కవడం వల్లే తన ఫిర్యాదును పట్టించుకోవడం లేదంటూ సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. దీక్ష చేస్తున్న మణిని తహసీల్దార్ ఆఫీసు ముందు నుంచి తరలించినా మణి మాత్రం తన పోరాటాన్ని వీడకుండా దీక్ష కొనసాగిస్తుండటం విశేషం.

Young Man Fight

Young Man Fight

ఇక్కడ తహసీల్దార్‌ పోస్టింగ్‌ కోసం ఎందుకు క్యూలు కడుతున్నారో ఇప్పుడు అర్థమవుతోంది.. విరుచుకుపడ్డ మంత్రి

ప్రకాశంజిల్లా పెద్దారవీడు మండల రెవెన్యూ అధికారులపై మంత్రి ఆదిమూలపు సురేష్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కాపురంలో డివిజన్‌ స్థాయి జగనన్న కాలనీల సమీక్షా సమావేశంలో మంత్రి సురేష్‌ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై విరుచుకుపడ్డారు. పెద్దారవీడు మండలంలో ప్రభుత్వ, పోరంబోకు భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. రెవెన్యూ అధికారులు కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ఇతరులకు ఆన్‌లైన్‌లో ఎక్కించి ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు.

పెద్దారవీడు తహసీల్దార్‌ పోస్టింగ్‌ కోసం పదుల సంఖ్యలో అధికారులు క్యూలో ఎందుకు ఉంటున్నారో ఇప్పుడు అర్దం అవుతుందన్నారు. వేల ఎకరాల ప్రభుత్వ భూములను ఇప్పటికే ఆన్‌లైన్‌ చేసి అక్రమార్కులకు దోచి పెడుతున్నారన్నారు. పెద్దారవీడు మండలంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గత నాలుగేళ్ళుగా ప్రభుత్వ భూముల అన్యాక్రాతంపై విచారణ చేస్తామన్నారు.

ఇప్పటికే భూముల ఆన్‌లైన్‌ కుంభకోణంపై నలుగురు స్పెషల డిప్యూటీ కలెక్టర్ల ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించామన్నారు. తన 13 ఏళ్ల ఎమ్మెల్యే పదవీకాలంలో ఐదుగురు పెద్దారవీడు తహసీల్దార్లు సస్పెండ్ అయ్యారంటే ఈ మండలంలో అవినీతి, అక్రమాలు ఎంత విచ్చలవడిగా జరుగుతున్నాయో అర్ధం అవుతుందన్నారు. ప్రభుత్వ భూములు కాపాడకుంటే కఠిన చర్యలు తప్పవని, ఇదే తహసీల్దార్లకు చివరి హెచ్చరిక చేస్తున్నామన్నారు మంత్రి ఆదిమూలపు.

Read also: Snake Bite: కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కిన గీత కార్మికుడు.. పాము కాటేయడంతో గాల్లో కలిసిపోయిన ప్రాణాలు