Chilakaluripet: విషాదం.. షటిల్ ఆడుతూ కుప్పకూలిన కిశోర్.. ఆస్పత్రికి తరలించే లోపే మృతి
Chilakaluripet: క్షణాల్లోనే అతని ప్రాణాలు పోయాయి. ఎంతో హుషారుగా ఉంటూ షటిల్ ఆడిన కిశోర్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు...
Chilakaluripet: క్షణాల్లోనే అతని ప్రాణాలు పోయాయి. ఎంతో హుషారుగా ఉంటూ షటిల్ ఆడిన కిశోర్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఏమైందో తెలిసేలోగా ప్రాణాలు పోయాయి. ఒక్కసారిగా అతను కుప్పకూలిపోవడంతో షటిల్ ఆడుతున్న వారు కంగారు పడ్డారు. హుటాహుటిన అన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కిషోర్ ప్రాణాలు పోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటన చిలకలూరిపేటలో చోటు చేసుకుంది. షటిల్ ఆడుతున్న కిషోర్ గుండెనొప్పితో కుప్పకూలిపోయాడు. ఆ నిమిషంలోనే అతని ప్రాణాలు పోయాయి. అతన్ని ఆసుపత్రికి తరలించిన ప్రయోజనం లేకుండాపోయింది. కిషోర్ మరణంపై తోటి స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ టీవీ ఫుటేజీల్లో రికార్డ్ అయ్యాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి