Chittoor District Accident: అమానవీయం.. చిత్తూరు జిల్లాలో కోళ్ల లారీకి యాక్సిడెంట్.. మనుషులు చనిపోయినా పట్టించుకోకుండా…
మనుషుల్లో విలువలు, మానవత్వం ఏ రేంజ్ కు పడిపోయాయో చెప్పడానికి ఈ ఘటనను ఉదాహారణగా తీసుకోవచ్చు. ఎవరికైనా రోడ్డుపై యాక్సిడెంట్ జరిగితే..

మనుషుల్లో విలువలు, మానవత్వం ఏ రేంజ్ కు పడిపోయాయో చెప్పడానికి ఈ ఘటనను ఉదాహారణగా తీసుకోవచ్చు. ఎవరికైనా రోడ్డుపై యాక్సిడెంట్ జరిగితే.. అటుగా వెళ్తున్నవారు క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించడమో లేక పోలీసులకు సమాచారం ఇవ్వడమో చేస్తుంటారు. కానీ చిత్తూరు జిల్లాలో మాత్రం ఓ యాక్సిడెంట్ దుర్ఘటనను లూఠీకీ ఉపయోగించుకున్నారు స్థానికులు. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా బాకరావుపేట ఘాట్‌రోడ్డులో ఓ కోళ్లలారి యాక్సిడెంట్‌కు గురైంది. బ్రాయిలర్ కోళ్లతో వెళుతున్న లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కోళ్ల లారీ డ్రైవర్, కారులో ఉన్న సుజాత అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే యాక్సిడెంట్ జరిగి మృతదేహాలు అక్కడ చిక్కుకుని ఉంటే.. గాయపడ్డవారు బాధలో ఉంటే.. కనీస మానవీయ విలువలు లేకుండా స్థానికులు లూఠీకి పాల్పడ్డారు. యాక్సిడెంట్‌కు గురైన కోళ్ల లారీ నుంచి.. కోళ్లను ఎత్తుకుపోయారు. లారీ పల్టీ కొట్టడంతో కోళ్లన్నీ జాలీలతో సహా చిందరవందరగా పడిపోయాయి.
ఇదే అదనుగా భావించిన స్థానికులు కోళ్లను లూఠీ చేశారు. లారీ, కారులో శవాలు ఉండగానే కోళ్లన్నీ మాయం చేశారు. కరోనా మషులకు చాలా పాఠాలు నేర్పిందని భావించాం.. కానీ మనుషుల్లోని ఈ కక్కుర్తి మాత్రం దూరం చేయలేకపోయిందని ఈ ఉదంతంలో అర్థమైంది.
Also Read: 5 రోజుల క్రితమే పెళ్లి.. చికెన్ తెచ్చేందుకు వెళ్లి.. అనంతలోకాలకు