మహాత్మునికి కూడా జైలు జీవితం తప్పలేదు.. రాజమహేంద్రవరంలో ముగిసిన నారా భువనేశ్వరి నిరాహార దీక్ష..
Bhuvaneshwari protest: చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ఏపీ, తెలంగాణ, ఢిల్లీలో దీక్షలు చేసింది టీడీపీ. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఒక్కరోజు నిరాహర దీక్షకు పార్టీ క్యాడర్ భారీ ఎత్తున మద్దతు పలికారు. ఏపీలో పలు చోట్ల వినూత్న రితీలో పార్టీ శ్రేణులు దీక్షలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ ఆయన సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన దీక్ష రాజమండ్రిలో ముగిసింది. చంద్రబాబుకు మద్దతుగా ఆమె చేపట్టిన ఒక్కరోజు నిరాహార దీక్ష ను రాజమహేంద్రవరంలో ఆమెకు నిమ్మరసం ఇచ్చి చిన్నారులు విరమింపజేశారు.

చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ ఆయన సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన దీక్ష రాజమండ్రిలో ముగిసింది. చంద్రబాబుకు మద్దతుగా ఆమె చేపట్టిన ఒక్కరోజు నిరాహార దీక్ష ను రాజమహేంద్రవరంలో ఆమెకు నిమ్మరసం ఇచ్చి చిన్నారులు విరమింపజేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునేందుకు ఈ దీక్ష కార్యక్రమం చేపట్టానని చెప్పారు భువనేశ్వరి. గాంధీ మహాత్మునికి కూడా జైలు జీవితం తప్పలేదన్నారు. రాష్ట్రం, ప్రజల బాగు కోసమే చంద్రబాబు నిత్యం పరితపించేవారంటూ భావోద్వేగానికి గురయ్యారు భువనేశ్వరి.
చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ఆయన సతీమణి చేపట్టిన సత్యమేయజయతే దీక్షకు ఢిల్లీలో సంఘాభావంగా టీడీపీ ఎంపీలు, నేతలు దీక్ష చేశారు. దీక్షలో నారా లోకేష్ తో పాటు, ఎంపీలు పాల్గొన్నారు. దీక్షను విరమించారు. తనపై పెట్టిన మూడు కేసులు తన శాఖకు సంబంధంలేన్నారు నారా లోకేష్. చంద్రబాబును ఎలా అరెస్ట్ చేశారో.. తనను కూడా అరెస్ట్ చేస్తే న్యాయము, చట్టాలే కాపాడాలన్నారు లోకేష్. జగన్ ప్రభుత్వం ముమ్మాటికి క్షక్ష సాధింపు తోనే కేసులు పెడుతుందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం చేసే తప్పులను ఎక్స్‌ఫోజ్ చేస్తూ.. తమ పోరాటం కొనసాగిస్తామని అన్నారు లోకేష్.
అటు హైదరాబాద్‌లోను చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ దీక్ష చేపట్టింది. దీక్షలో తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబు కుటుంబ సభ్యులు, బాలకృష్ణ సతీమణి, హరికృష్ణ కుమార్తె సుహాసిని పాల్గొన్నారు. అటు మంగళగిరిలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దీక్ష చేశారు. దీక్షలు టీడీపీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టిడిపి నేతలు నిరాహార దీక్షలు చేపట్టారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. కుప్పంలో చంద్రబాబు కోసం చండీ హోమం, మృత్యుంజయ హోమంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటు పూతలపట్టులో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తిరుమలకు పాదయాత్ర చేపట్టారు టిడిపి శ్రేణులు. చంద్రబాబు జైలు నుంచి త్వరగా విడుదల కావాలని ప్రార్థిస్తూ కొండకిందపల్లి నుంచి తిరుమలకు పాదయాత్ర చేశారు.
చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ… రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరి గారు చేపట్టిన సత్యమేవ జయతే దీక్ష చిత్రాలివి#BhuvanammaDeeksha#SatyamevaJayateDeeksha#GandhiJayanti#CBNLifeUnderThreat#TDPJSPTogether#APvsJagan#IAmWithBabu#PeopleWithNaidu… pic.twitter.com/Ljp7jolghF
— Telugu Desam Party (@JaiTDP) October 2, 2023
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
