Skill Development Case: ‘చంద్రబాబు గుండె సైజు పెరిగింది’.. హెల్త్ ట్రీట్‌మెంట్‌పై హైకోర్టులో మెమో దాఖలు
Chandrababu Naidu Skill Development Case: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు నాటినుంచి ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం చంద్రబాబు బెయిల్ పై ఉన్నారు. ఈ తరుణంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

Chandrababu Naidu Skill Development Case: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు నాటినుంచి ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం చంద్రబాబు బెయిల్ పై ఉన్నారు. ఈ తరుణంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణకు రాగా.. సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. కండీషన్స్‌తో బెయిల్ ఇచ్చాక ఇన్వెస్టిగేషన్‌ను అడ్డుకుంటున్నారని సీఐడీ అఫిడవిట్‌లో పేర్కొంది. చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించింది. ప్రెస్ స్టేట్‌మెంట్స్ ద్వారా సహా ముద్దాయిలతో తప్పుడు ఫిర్యాదులు ఇప్పిస్తున్నారని ఆరోపించింది. విచారణకు చంద్రబాబుతోపాటు సాక్షులు కూడా సహకరించటం లేదని.. హైదరాబాద్ వెళ్లిన చంద్రబాబు.. బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి టీడీపీ ర్యాలీలో పాల్గొన్నారని గుర్తు చేసింది. టీడీపీ ఖాతాలోకి వచ్చిన నిధుల వివరాలు ఇవ్వటం లేదని చెప్పింది సీఐడీ. అలాగే.. బాబు అరెస్ట్‌కు సంబంధించి.. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ NHRCకి ఫిర్యాదు చేశారని తెలిపింది. పొన్నవోలు సుధాకర్, సీఐడీ చీఫ్‌పైనా ఫిర్యాదు చేసినట్లు అఫిడవిట్‌లో ప్రస్తావించింది సీఐడీ.
మెడికల్ హిస్టరీలో 10 రకాల అనారోగ్య సమస్యలు
ఇదిలావుంటే.. చంద్రబాబు హెల్త్ ట్రీట్‌మెంట్‌పై మెమో దాఖలు చేశారు ఆయన తరపు న్యాయవాదులు. ఎక్కడ వైద్యం తీసుకున్నారు?.. ఎలాంటి వైద్యం తీసుకున్నారనే దానిపై మెడికల్ రిపోర్ట్ జత చేశారు. ఈ సందర్భంగా.. మెడికల్ హిస్టరీలో పది రకాల అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తెలిపారు. చంద్రబాబు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్టుగా రిపోర్ట్ ఇచ్చారు. చంద్రబాబు గుండె పరిణామం పెరిగిందని.. గుండెకు రక్తం సరఫరా చేసే నాలాల్లో సమస్యలున్నాయన్నారు. షుగర్‌ను అదుపులో ఉన్నప్పటికీ.. కళ్లు తిరగడంతోపాటు ఇతర సమస్యలు ఉన్నట్లు తెలిపారు. దాంతోపాటు.. ఐదు వారాలపాటు కంటి పరీక్షల కోసం షెడ్యూల్ ఇచ్చినట్లు రిపోర్ట్స్‌లో స్పష్టం చేశారు.
వీడియో చూడండి..
ప్రస్తుతం కంటి చికిత్స తర్వాత చంద్రబాబు కోలుకుంటున్నారని.. అయితే.. పూర్తిగా కోలుకునేందుకు సమయం పడుతుందని.. అప్పటివరకు మందులు వాడాల్సి ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబుకు మూడు నెలల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు చెప్పారు. వీటన్నింటికీ సంబంధించి వైద్యుల సూచనలతో కూడిన నివేదికలను మెమో ద్వారా హైకోర్టుకు సమర్పించారు చంద్రబాబు తరపు న్యాయవాదులు.
మొత్తంగా.. చంద్రబాబు రెగ్యులర్ బెయిల్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. అటు.. సీఐడీ అఫిడవిట్, ఇటు.. చంద్రబాబు న్యాయవాదుల రిపోర్ట్‌లను పరిశీలించిన హైకోర్టు.. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
