YS Jagan: ముందుంది మహా సంగ్రామం! కుప్పంకు నీరివ్వలేని బాబు.. పల్నాడును అభివృద్ధి చేస్తామంటే నమ్మాలా..
ఏపీలో ఎన్నికల రాజకీయం అప్పుడే మొదలైంది. మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగనుండటంతో.. ఇప్పటి నుంచే అధికార, ప్రతిపక్షాలు.. జోరు పెంచి పోరుకు సిద్ధమయ్యాయి. అధికార పార్టీని ఎదుర్కొనేందుకు.. టీడీపీ- జనసేన ఒక్కటయ్యాయి. అటు.. విపక్షాలకు ధీటుగా.. వైసీపీ కూడా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. వై నాట్ 175 నినాదంతో జగన్ ముందుకు వెళ్తున్నారు.

ఏపీలో ఎన్నికల రాజకీయం అప్పుడే మొదలైంది. మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగనుండటంతో.. ఇప్పటి నుంచే అధికార, ప్రతిపక్షాలు.. జోరు పెంచి పోరుకు సిద్ధమయ్యాయి. అధికార పార్టీని ఎదుర్కొనేందుకు.. టీడీపీ- జనసేన ఒక్కటయ్యాయి. అటు.. విపక్షాలకు ధీటుగా.. వైసీపీ కూడా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. వై నాట్ 175 నినాదంతో జగన్ ముందుకు వెళ్తున్నారు. ఈక్రమంలోనే.. అధికార, విపక్షాల మధ్య విమర్శనాస్త్రాలు మరింత తీవ్రమయ్యాయి. పల్నాడు జిల్లా మాచర్ల దగ్గర వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్.. ప్రతిపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు సంధించారు. కన్నతల్లికి అన్నం పెట్టనివాడు పిన్నతల్లికి బంగారు గాజులు కొనిస్తాడా? అంటూ ఎద్దేవా చేశారు సీఎం జగన్. సొంత నియోజక వర్గం కుప్పంకు నీరివ్వలేని చంద్రబాబు.. పల్నాడును అభివృద్ధి చేస్తామంటే ఎలా నమ్మాలి అంటూ ఏపీ సీఎం జగన్ ప్రశ్నించారు.
నరమాంసం రుచిమరిగిన పులి..ఫ్రీ గిఫ్ట్‌గా బంగారు కడియం ఇస్తానంటే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు సీఎం జగన్. చంద్రబాబు తీరు కూడా అలాగే ఉందన్నారు. చంద్రబాబు 2047 విజన్‌పై సెటైర్లు విసిరారు ఏపీ సీఎం జగన్.. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏమీ చేయని చంద్రబాబు.. మరో 50 ఏళ్ల తర్వాత ఏం చేస్తారో చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు జగన్.
తాను ఒక్కడే చెబితే ప్రజలు నమ్మరని భావించిన చంద్రబాబు.. మరో నలుగురితో కలిసి ప్రజలను మోసం చేసేందుకు.. అబద్దపు హామీలను ఇస్తున్నారని సీఎం జగన్ ఆరోపించారు. చంద్రబాబు తన బినామీల భూముల విలువ పెంచేందుకు.. అమరావతి పేరుతో భ్రమ కల్పించారని ఆరోపించారు సీఎం జగన్.
జగన్ వీడియో చూడండి..
అధికార, విపక్షాల మధ్య రోజురోజుకు విమర్శల డోస్ పెరుగుతుండటంతో.. ఏపీలో రాజకీయం మరింత వేడెక్కుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..