AP SA-1 Exam Revised Schedule: ఏపీ పాఠశాలలకు సమ్మెటివ్-1 పరీక్షలు.. షెడ్యూల్ సవరిస్తూ ఆదేశాలు జారీ
ఏపీలో పలు మార్లు సమ్మెటివ్-1 పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష షెడ్యూల్‌ను సవరిస్తూ పాఠశాల విద్యాశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. 1వ తరగతి నుంచి 5వ తరగతుల వరకు నవంబరు 28 నుంచి డిసెంబరు 5 వరకు పరీక్షలు నిర్వహించాలని షెడ్యూల్‌లో పేర్కొంది, ఇక 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు తరగతులకు డిసెంబరు 8 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆంగ్ల భాష సబ్జెక్టులో టోఫెల్ పరీక్షను ప్రత్యేకంగా నిర్వహించాలని పాఠశాలలకు ఆదేశాలు..
అమరావతి, నవంబర్ 15: ఏపీలో పలు మార్లు సమ్మెటివ్-1 పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష షెడ్యూల్‌ను సవరిస్తూ పాఠశాల విద్యాశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. 1వ తరగతి నుంచి 5వ తరగతుల వరకు నవంబరు 28 నుంచి డిసెంబరు 5 వరకు పరీక్షలు నిర్వహించాలని షెడ్యూల్‌లో పేర్కొంది, ఇక 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు తరగతులకు డిసెంబరు 8 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆంగ్ల భాష సబ్జెక్టులో టోఫెల్ పరీక్షను ప్రత్యేకంగా నిర్వహించాలని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, స్మార్ట్ టీవీలు ఉన్నచోటనే ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఏపీలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు ఫీజుల వసూళ్లు దందా.. గవర్నర్‌కు తల్లిదండ్రుల ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కాలేజీల్లో యాజమాన్యాలు ప్రత్యేక ఫీజుల పేరుతో విద్యార్థుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఏపీ తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు నరహరి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ నిర్ణయించిన ఫీజుల నియమాలను ఇంజనీరింగ్ కాలేజీలు అమలు చేయడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని, నిబంధనలకు భిన్నంగా యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయన్నారు. బిల్డింగ్ ఫండ్ పేరుతో రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నాయని పేర్కొన్నారు. అడ్మిషన్ ఫీజు పేరుతో ఏటా రూ.2 వేలు, ప్రాంగణ నియామకాలంటూ రూ.10 వేలు వసూలు చేస్తున్నాయని ఫిర్యాదులో తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారీతిలో భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ ఎడ్‌సెట్ 2023 ప్రత్యేక విడతలో 2,604 మందికి సీట్లు
తెలంగాణ ఎడ్‌సెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ పూర్తయ్యింది. ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొన్న వారికి మంగళవారం (నవంబర్ 14) సీట్లు కేటాయించినట్లు ప్రవేశాల కమిటీ కన్వీనర్ పి రమేష్‌బాబు తెలిపారు. కన్వీనర్ కోటా కింద 6,419 బీఈడీ సీట్లు అందుబాటులో ఉండగా.. వాటిల్లో 3,988 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నట్లు తెలిపారు. వారిలో 2,604 మందికి సీట్లు దక్కాయని ఆయన వివరించారు. ఇంకా 3,815 సీట్లు మిగిలిపోయాయని వెల్లడించారు. తాజాగా సీట్లు పొందిన వారందరూ సంబంధిత కాలేజీల్లో చేరినా మొత్తం కన్వీనర్ కోటాలో 10,454 మంది ప్రవేశాలు పొందినట్లవుతుందన్నారు. ప్రత్యేక విడతలో సీట్లు పొందిన వారు ఫీజు చెల్లించి నవంబర్ 15 నుంచి 17వ తేదీలోపు సీట్లు పొందిన కాలేజీల్లో ధ్రువపత్రాలను సమర్పించి, ప్రవేశాలు పొందాలని సూచించారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.