Srisailam: 34 రోజుల్లో శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం ఎంతో తెల్సా..?
ఈ హుండీ లెక్కింపులో పలు రకాల విదేశీ కరెన్సీ కూడా వచ్చినట్లు తెలిపారు. అందులో యుఎస్ఏ డాలర్లు 649, మలేషియా రింగిట్స్ 50, ఆస్ట్రేలియా డాలర్లు 440, కెనడా డాలర్లు 70, సౌదీ రియాల్స్ 5, కత్తర్ రియాల్స్ 39, యూఏఈ ధీరంస్ 50, సింగపూర్ డాలర్లు 10.. హుండీలో వచ్చినట్లు తెలియజేశారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...
శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు అధికారులు. ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించగా.. శ్రీశైల మల్లన్న దేవస్థానానికి 3 కోట్ల 57 లక్షల 88 వేల 078 రూపాయల నగదు కానుకల రూపంలో వచ్చింది తెలిపారు. గత 34 రోజులలో శ్రీస్వామి అమ్మవార్లకు భక్తులు ఈ నగదు వచ్చినట్లు ఈవో పెద్దిరాజు వివరించారు. ఈ హుండీ లెక్కింపులో పలు రకాల విదేశీ కరెన్సీ కూడా వచ్చినట్లు తెలిపారు. అందులో యుఎస్ఏ డాలర్లు 649, మలేషియా రింగిట్స్ 50, ఆస్ట్రేలియా డాలర్లు 440, కెనడా డాలర్లు 70, సౌదీ రియాల్స్ 5, కత్తర్ రియాల్స్ 39, యూఏఈ ధీరంస్ 50, సింగపూర్ డాలర్లు 10.. హుండీలో వచ్చినట్లు తెలియజేశారు. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య దేవస్థానం ఈవో పెద్దిరాజు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.