Chandrababu Naidu: ‘నాకు పదవులు ముఖ్యం కాదు’.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
చంద్రబాబు సమక్షంలో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనను విమర్శించారు. మద్యపాన నిషేధం అని చెప్పి కొత్త బ్రాండ్లను తీసుకొచ్చారన్నారు. వ్యక్తులపైన కాదు సంస్థలపైన నా పోరాటం అన్నారు. తన జీవితంలో వ్యక్తులపైన ఎప్పుడు పోరాటం చేయలేదని తెలిపారు.
చంద్రబాబు సమక్షంలో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనను విమర్శించారు. మద్యపాన నిషేధం అని చెప్పి కొత్త బ్రాండ్లను తీసుకొచ్చారన్నారు. వ్యక్తులపైన కాదు సంస్థలపైన నా పోరాటం అన్నారు. తన జీవితంలో వ్యక్తులపైన ఎప్పుడు పోరాటం చేయలేదని తెలిపారు. సమస్యలపైన పోరాటం చేయడం కోసం తాను ఎలాంటి త్యాగాలకైనా సిద్దమన్నారు. రేపు జరిగే ఎన్నికలు 5కోట్ల మంది ప్రజానీకానికి ప్రస్తుత ముఖ్యమంత్రికి మధ్య జరుగుతున్నాయన్నారు.
తనకోసమో, జనసేన కోసమో కాదని తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వాలు మారాయి కానీ అభివృద్ది కాదన్నారు. తాను వేసిన ఫౌండేషన్ నేటికీ బాగా విస్తరించినందుకు గర్వపడుతున్నానన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు చాలన్నారు. అది మీరు ఇచ్చినదే అని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రేపు జరిగే ఎన్నికలు ఏకపక్షంగా జరగాలని పిలుపునిచ్చారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో 10 – 12 మంది ముఖ్యమంత్రులను చూశాన్నారు. ఇప్పటి వరకూ ప్రజల భవిష్యత్తు కోసం పోరాటాలు చేశానన్నారు. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా నంబర్ వన్ స్థానంలో ఉండాలన్నది తన లక్ష్యం అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..