'బాబు ఇద్దరు పీకేలను పెట్టుకుంది అందుకే' -- కొడాలి నాని ఘాటు సెటైర్స్

‘బాబు ఇద్దరు పీకేలను పెట్టుకుంది అందుకే’ — కొడాలి నాని ఘాటు సెటైర్స్

Ram Naramaneni

|

Updated on: Dec 24, 2023 | 3:14 PM

చంద్రబాబు-ప్రశాంత్‌ కిషోర్‌ భేటీపై కొడాలి నాని సెటైర్లు వేశారు. ప్రశాంత్ కిషోర్ బుర్రలో గుజ్జంతా 2014లోనే పీల్చేసామని అన్నారు. గతంలో చంద్రబాబు PKను తిట్టారని.. అదే PKతో ఇప్పుడెలా కలుస్తున్నారని ప్రశ్నించారు. ప్రశాంత్ కిషోర్‌కి ఇప్పుడు ఐప్యాక్‌తో సంబంధం లేదని.. ఆయన రాజకీయ పార్టీని పెట్టి ముందుకు సాగుతున్న విషయాన్ని గుర్తు చేశారు.

చంద్రబాబు-ప్రశాంత్‌ కిషోర్‌ భేటీపై కొడాలి నాని సెటైర్లు వేశారు. ప్రశాంత్ కిషోర్ బుర్రలో గుజ్జంతా 2014లోనే పీల్చేసామని అన్నారు. గతంలో చంద్రబాబు PKను తిట్టారని.. అదే PKతో ఇప్పుడెలా కలుస్తున్నారని ప్రశ్నించారు. ప్రశాంత్ కిషోర్‌కి ఇప్పుడు ఐప్యాక్‌తో సంబంధం లేదని.. ఆయన రాజకీయ పార్టీని పెట్టి ముందుకు సాగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. బాబు-PK భేటీకి ఓ లెక్కుందంటూ తనదైన స్టైల్లో చెప్పుకొచ్చారు నాని.

చంద్రబాబు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారని.. అందుకే ఇద్దరు పీకేలను పెట్టుకున్నారని ఆరోపించారు. ఒక PK ఇండియా కూటమితో మాట్లాడానికి.. మరో పీకే బీజేపీతో మాట్లాడానికి అని సెటైర్లు వేశారు. ప్రశాంత్ కిషోర్ వచ్చింది ఇండియా కూటమిలోకి రావాలని బాబును అడగడానికే.. అని ఆరోపించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..