Chandrababu: గుంటూరు, బాపట్ల జిల్లాల్లో “ఇదేం ఖర్మ రాష్ట్రానికి”.. ఉద్రిక్తతల మధ్య చంద్రబాబు రోడ్‌ షో

టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రోజుల పర్యటన పెద్ద సవాలుగా మారింది. అధికారపార్టీ కార్యకర్తల నిరసనల నేపథ్యంలోనే కొనసాగుతోంది. ఉమ్మడి గుంటూరులో రెండో రోజు పర్యటించనున్నారు చంద్రబాబు

Chandrababu: గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఇదేం ఖర్మ రాష్ట్రానికి.. ఉద్రిక్తతల మధ్య చంద్రబాబు రోడ్‌ షో
Chandrababu
Follow us

|

Updated on: Dec 09, 2022 | 8:30 AM

ఇదేం ఖర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి గుంటూరులో పర్యటిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ నేపథ్యంలో పెదకాకాని, నారాకోడూరు, పొన్నూరులో పర్యటించారు. ఈ పర్యటనకు ముందు చంద్రబాబు గో బ్యాక్‌ అంటూ ప్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసన తెలిపారు వైసీపీ నాయకులు. గో బ్యాక్‌ చంద్రబాబు అంటూ వ్యతిరేకంగా ప్లెక్సీలు కట్టారు. ధూళిపాళ్ల నరేంద్ర సంఘం డైరీకి తప్ప పొన్నూరుకు చేసిందేమి లేదంటూ బ్యానర్‌ మీద రాశారు. వెంటనే పోలీసులు ఆ ప్లెక్సీలను తొలగించారు. ఇక చంద్రబాబు రాకతో పెదకాకానీ జంక్షన్‌ వద్ద బైక్‌ ర్యాలీ నిర్వహించారు. బుడంపాడు వద్ద ఆయనకు గజమాలతో తెలుగు దేశం నాయకులు స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీగా నారాకోడూరుకు బయల్దేరి వెళ్లారు.

అయితే పొన్నూరు నియోజకవర్గంలో పర్యటిస్తుండగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో వైసీపీ కార్యకర్తల మీదికి దూసుకెళ్లారు. దీంతో ఇరువర్గాల మద్య ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకొని నేతలను అక్కడి నుంచి పంపించి వేశారు.

వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఇంటికి వెళ్లడం ఖాయమని.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్‌ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు స్పష్టం చేశారు. నాలుగేళ్ల తర్వాత బీసీలు గుర్తుకు వచ్చి.. జయహో బీసీ సభ నిర్వహించారని సెటైర్లు వేశారు.

ఇవి కూడా చదవండి

చంద్రబాబు రోడ్‌ షో షెడ్యూల్ ఇదే..

మరో రెండు రోజుల పాటు గుంటూరు, బాపట్ల జిల్లాల్లో చంద్రబాబు పర్యటన సాగనుంది. భాగంగా పొన్నూరు నుంచి రోడ్డు మార్గంలో బాపట్ల మండలం చుండూరుపల్లికి శుక్రవారం మధ్యాహ్నం 3.15కు చేరుకుంటారు. సాయంత్రం ఐదున్నరకు గుంటూరు మార్గంలో ఆర్వోబీ నుంచి రోడ్‌షో ప్రారంభమవుతుంది. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహ కూడలిలో బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడతారు. రాత్రి 8 గంటలకు బాపట్ల ఇంజినీరింగ్‌ కళాశాలకు చేరుకొని అతిథి గృహంలో బాబు బస చేస్తారు.

అక్కడే ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల ఎస్సీ నేతలు, విద్యార్థులతో శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ముఖాముఖి నిర్వహిస్తారు. రానున్న ఎన్నికలకు టీడీపీ శ్రేణులను సమాయత్తం చేయడానికి దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు స్టూవర్టుపురంలో గిరిజన మహిళలతో బాబు సమావేశమవుతారు. అనంతరం చీరాలకు బయలుదేరుతారు.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం