AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electricity Bill Saving Tips: కరెంటు బిల్లు చూసి మైండ్ బ్లాక్ అవుతోందా ?.. ఇక చింతించకండి.. మీ ఇంట్లో దీనిని వాడితే చాలు..

కరెంటు బిల్లు వాచిపోతోందని బాధపడుతున్నారా..? మీ ఇంట్లో కరెంటు తగ్గుతూ.. పెరుగుతోందా..? పెరిగినప్పుడు ఇంట్లోని ఎలక్రికల్ పరికరాలు పాడవుతున్నాయా.? ఇలాంటి పరికరాన్ని ఓ సారి మీ ఇంట్లో పెట్టుకోండి.

Electricity Bill Saving Tips: కరెంటు బిల్లు చూసి మైండ్ బ్లాక్ అవుతోందా ?.. ఇక చింతించకండి.. మీ ఇంట్లో దీనిని వాడితే చాలు..
Wellberg Power Saver Device
Sanjay Kasula
|

Updated on: Dec 07, 2022 | 12:51 PM

Share

ప్రస్తుతం పెరుగుతున్న కరెంటు బిల్లుల వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను నివారించడానికి, చాలా మంది సోలార్ ప్లేట్లను పెట్టించుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఖరీదైన సోలార్ ప్లేట్ల కారణంగా.. ప్రస్తుతానికి ప్రతి ఒక్కరూ మరో ఆలోచన చేస్తున్నారు. మీరు కూడా అలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే చింతించకండి. కేవలం రూ. 500లతో లభించే ఈ  పరికరం గురించి ఇవాళ మనం చూద్దాం. దీన్ని ఉపయోగించి మీ విద్యుత్ బిల్లును సగానికి తగ్గించుకోవచ్చు. ఆ పరికరం (విద్యుత్ సేవింగ్ పరికరం) ఏంటో తెలుసుకుందాం.

500 కంటే తక్కువ ధరకే పరికరం అందుబాటులో ఉంది

ఈ మంత్రముగ్ధులను చేసే పరికరం పేరు వెల్‌బర్గ్ పవర్ సేవర్ అని విద్యుత్ నిపుణులు చెబుతున్నారు. ఈ పరికరం ధర రూ. 500ల కంటే తక్కువ. ఈ పరికరాన్ని అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ రోజుల్లో కంపెనీ తన వినియోగదారులకు 10 రోజుల రిటర్న్ పాలసీని కూడా ఇస్తోంది. అంటే మీకు ఈ పరికరం ఉపయోగకరంగా లేకుంటే.. మీరు దానిని 10 రోజులలోపు వాపసు చేయవచ్చు.

ఇంట్లో లేదా ఆఫీసులో కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు

కంపెనీ ప్రకారం, ఈ చిన్న పరికరం (విద్యుత్ సేవింగ్ పరికరం) ఇంట్లో, కార్యాలయంలో ఎక్కడైనా అమర్చవచ్చు. ఇది డ్యూయల్ బెనిఫిట్ డివైజ్ అని కంపెనీ పేర్కొంది. ఈ పరికరాన్ని ఇన్‌స్టాల్ చేయడం ద్వారా, వోల్టేజ్ హెచ్చుతగ్గుల నుంచి రక్షించడమే కాకుండా, ఇది చాలా వరకు విద్యుత్ బిల్లును తగ్గిస్తుంది. ఎలక్ట్రికల్ ఉపకరణాలు ఎక్కువ కాలం పనిచేయడంలో కూడా ఈ డివైజ్ దోహదపడుతుందని కంపెనీ చెబుతోంది.

50 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుంది

కంపెనీ ప్రకారం, వెల్‌బర్గ్ పవర్ సేవర్ పరికరాన్ని అమర్చడం చాలా సులభం. మీరు దానిని మీ విద్యుత్ మీటర్ దగ్గర అమర్చవచ్చు. దీన్ని ఇన్స్టాల్ చేయడానికి ఇంటిని తిరిగి వైరింగ్ చేయవలసిన అవసరం లేదు. మీరు దానిని మీటర్ సమీపంలోని ఏదైనా సాకెట్‌లో సులభంగా అమర్చవచ్చు. ఈ పరికరాన్ని అమర్చిన తర్వాత, ఇంటి విద్యుత్ బిల్లు దాదాపు 40-50 శాతం తగ్గుతుందని పేర్కొన్నారు.

Note: ( ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించడం జరిగింది. టీవీ9 NEWS దానిని ధృవీకరించలేదు.)

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ కోసం