ఏలూరు వింత వ్యాధిపై టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కీలక ప్రకటన.. వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని డిమాండ్

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధితో ప్రజలందరు ఆగమాగం అవుతున్నారు. నోటి నుంచి నురగలుగక్కుతూ

  • uppula Raju
  • Publish Date - 9:41 pm, Sun, 6 December 20
ఏలూరు వింత వ్యాధిపై టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కీలక ప్రకటన.. వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని డిమాండ్

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధితో ప్రజలందరు ఆగమాగం అవుతున్నారు. నోటి నుంచి నురగలుగక్కుతూ చాలామంది అస్వస్థతకు గురవుతున్నారు. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉదయం నుంచి ఇప్పటివరకు 200లకు పైగా బాధితులు చేరికయ్యారు. వీటికి గల కారణాలను వైద్యాధికారులు వెతుకుతున్నారు. బాధితులకు వెంట వెంటనే వైద్యం అందిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి చనిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్ర బాబునాయుడు మాట్లాడారు.

ఏలూరులో ప్రజలు అస్వస్థతకు గురవుతున్ననేపథ్యంలో అక్కడ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ వ్యాధి ఎందుకు ప్రబలుతుందో వైద్యాధికారులతో కమిటీ వేసి ఆరా తీయాలని కోరారు. బాధితులందరికి మెరుగైన వైద్యం అందించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో పేద ప్రజలకు ప్రాథమిక అవసరాలు తీర్చలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తోందని మండిపడ్డారు. ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించాలని సూచించారు. అసలు కలుషిత జలాల వల్లే ఈ సమస్య వచ్చింది కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వం యుద్ద ప్రాతిపాదికన చర్యలు చేపట్టి ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.