Good News: ఏపీ ప్రజలకు కేంద్రం శుభవార్త.. ఫ్రీ రేషన్ పథకం మార్చి వరకు పెంపు..

Pradhan Mantri Garib Kalyan Anna Yojana Scheme: ఏపీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని

Good News: ఏపీ ప్రజలకు కేంద్రం శుభవార్త.. ఫ్రీ రేషన్ పథకం మార్చి వరకు పెంపు..
Ration
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 11, 2022 | 4:42 PM

Pradhan Mantri Garib Kalyan Anna Yojana Scheme: ఏపీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని 2022 మార్చి వరకూ కేంద్ర ప్రభుత్వం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలోని లబ్దిదారులందరికీ మార్చి నెల వరకూ ఉచితంగా 5 కేజీల చొప్పున బియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. 2021 డిసెంబరు నుంచి లబ్దిదారులకు ఐదు కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేయాల్సిందిగా ఏపీ పౌరసరఫరాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో జనవరి 18 తేదీ నుంచి రాష్ట్రంలోని లబ్దిదారులందరికీ రేషన్ దుకాణాల ద్వారా 10 కేజీల చొప్పున ఈ బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్ వెల్లడించారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకంతో ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరనుంది.

కరోనా మహమ్మారి నేపథ్యంలో పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని ప్రారంభించింది. జాతీయ ఆహార భద్రత చట్టం, 2013 ప్రకారం దేశంలోని ప్రజలకు ప్రతి ఒక్కరికి నెలకు 5 కిలోల చొప్పున బియ్యం లేదా గోధుమలు అందిస్తున్నారు. అంత్యోదయ అన్నయోజన పథకం, ప్రియారిటీ హౌస్‌హోల్డర్స్‌కు ఉచితంగా బియ్యం/గోధుమలు పంపిణీ చేస్తారు. ప్రస్తుతం దేశంలో కోవిడ్-19 మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రంలోని మోదీ సర్కార్ మరోసారి పెంచుతూ.. నిర్ణయం తీసుకుంది.

Also Read:

AP Rains: ఏపీ ప్రజలకు వాతావరణశాఖ అలెర్ట్.. మూడు రోజులపాటు వర్షాలు..

‘Tek Fog’: దేశ రాజకీయాలలో మరోసారి చిచ్చు రేపుతున్న టెక్‌ ఫాగ్‌ యాప్ వ్యవహారం?