AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Airports: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్.. ఏపీ, తెలంగాణలో అక్కడ కొత్త ఎయిర్‌పోర్ట్‌లు.. నిర్మాణానికి లైన్ క్లియర్

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం తీపికబురు అందించింది. రెండు కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై కీలక అప్డేట్ ఇచ్చింది. ఏపీ, తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్‌లను నిర్మించనున్నారు. వీటి వివరాలను విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో పంచుకున్నారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

New Airports: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్.. ఏపీ, తెలంగాణలో అక్కడ కొత్త ఎయిర్‌పోర్ట్‌లు.. నిర్మాణానికి లైన్ క్లియర్
Adilabad Airport
Venkatrao Lella
|

Updated on: Mar 29, 2026 | 3:10 PM

Share

తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించనుంది. ఏపీ, తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన చేసింది. ఉడాన్ 2.0లో భాగంగా రెండు రాష్ట్రాల్లో నిర్మించనున్న కొత్త విమానాశ్రయాలపై కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన చేశారు. ఢిల్లీలో మీడియాలో మాట్లాడిన ఆయన.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణం గురించి వివరాలు వెల్లడించారు. ఇక ఇప్పటికే ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌లను పూర్తిస్థాయి ఎయిర్‌పోర్టులుగా మార్చడంపై ప్రకటన చేశారు. ఏపీ, తెలంగాణలో ఎక్కడెక్కడ ఎయిర్‌పోర్టులు రానున్నాయి.?. రామ్మోహన్ నాయుడు చేసిన ప్రకటన ఏంటి? అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్

ఏపీలో మరో కొత్త ఎయిర్ట్‌రానుంది. పల్నాడు జిల్లాలో ఇప్పటివరకు ఒక్క ఎయిర్‌పోర్ట్ కూడా లేదు. దీంతో ఆ జిల్లాలోని నాగార్జున సాగర్ వద్ద కొత్త ఎయిర్‌పోర్ట్ నిర్మించనున్నట్లు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఇక తెలంగాణలోని ఆదిలాబాద్‌లో కూడా విమానాశ్రయం నిర్మిస్తామన్నారు. దీని వల్ల ఆ రెండు ప్రాంతాలకు ఎయిర్ కనెక్టివిటీ లభిస్తుందని, లాజిస్ట్రిక్స్ రంగం అభివృద్ది చేయడం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ప్రస్తుతం ఆదిలాబాద్‌లో ఎయిర్‌ఫోర్స్ ఎయిర్‌స్ట్రిప్ రక్షణశాఖ ఆధీనంలో ఉందని, దాని పక్కన అదనపు భూమిని సేకరించి ప్రయాణికుల కోసం కొత్త ఎయిర్‌పోర్ట్ నిర్మిస్తామని తెలిపారు. అటు బేగంపేట ఎయిర్‌పోర్ట్ రన్‌వే కింద ట్రాఫిక్ టన్నెల్ నిర్మాణానికి అనుమతి వచ్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం దానికి అయ్యే ఖర్చు భరిస్తే తాము పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ సందర్భంగా ఉడాన్ 2.0 పథకం నిధులపై స్పష్టతిచ్చారు. మొత్తం రూ.28 వేల కోట్ల నిధులు కేటాయించగా.. అందులో రూ.12 వేల కోట్ల నిధులు కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణం కోస కేటాయించామని పేర్కొన్నారు.

వరంగల్ ఎయిర్‌పోర్ట్‌పై అప్డేట్

అటు వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌పై రామ్మోహన్ నాయుడు కీలక అప్డేట్ ఇచ్చారు. మామునూరు ఎయిర్‌పోర్ట్ ఫైల్ వివిధ శాఖల దగ్గర ఉందన్నారు. ఈ ఏడాది జూన్‌లో శంకుస్థాపన చేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. అలాగే కొత్తగూడెం, బసంత్ నగర్ ఎయిర్‌పోర్టులకు సంబంధించి భూ కేటాయింపులు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఇక భోగాపురం, గన్నవరం ఎయిర్‌పోర్ట్ విస్తరణ పనులు తుది దశకు వచ్చాయని, వచ్చే ఏడాది జూన్ కల్లా పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. అప్పటివనుంచి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఇక 2028 చివరికల్లా దేశంలో తయారైన తొలి విమానాన్ని తీసుకొస్తామన్నారు. ఎంబ్రాయ్ సంస్థ విమానాల తయారీని దేశీయంగా చేపట్టేందుకు ముందుకొచ్చిందని, విమానయాన రంగంలో ఇదొక విప్లవాత్మక మార్పుగా అభివర్ణించారు.

Follow Us