Subsidy Drones: మహిళల చేతికి డ్రోన్లు.. స్వావలంబన దిశగా మహిళలు
అతివలు అంతరిక్షంలోకి వెల్తున్నారు... విమానాలను అవలీలగా నడుపుతున్నారు. రాకెట్ ప్రయోగాల్లో తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. అయినప్పటికీ స్వావలంబన సాధ్యం కాలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలు ఆర్థికంగా అభివ్రుద్ది చెందినప్పుడే మహిళా సాధికారిత..

అతివలు అంతరిక్షంలోకి వెల్తున్నారు… విమానాలను అవలీలగా నడుపుతున్నారు. రాకెట్ ప్రయోగాల్లో తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. అయినప్పటికీ స్వావలంబన సాధ్యం కాలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలు ఆర్థికంగా అభివ్రుద్ది చెందినప్పుడే మహిళా సాధికారిత, స్వావలంబన సాద్యమవుతుందంటున్నారు ఫెమినిస్టులు.. ఇప్పుడు ఆ దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది. మహిళల చేతికి డ్రోన్లు అందించింది. వ్యవసాయ రంగంలో ఉన్న మహిళా కూలీలు ఇక డ్రోన్లు తిప్పుతూ ఆదాయన్ని పొందవచ్చు.
వ్యవసాయ రంగంలో అధునాతన యంత్ర పరికరాల వినియోగాన్ని పెంచాలని ప్రభుత్వాలు ఎప్పటి నుండో చెబుతున్నాయి. కూలీల సంఖ్య తగ్గిపోయిన నేపధ్యంలో సాగులో అధునాతన యంత్ర పరికరాలు ఉపయోగించి కూలీల కొరతను ఎదుర్కొవడంతో పాటు మెరుగైన దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పంట సాగులో వినియోగించే డ్రోన్లను తయారు చేసింది.
అయితే ఒక్కో డ్రోన్ ధర ఎనిమిది లక్షల రూపాయలుంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్లు కొనుగోలు చేయడానికి ముందుకు రావడంలేదు. ఈక్రమంలోనే కేంద్రం నమో దీదీ డ్రోన్స్ పథకాన్ని అమలులోకి తెచ్చింది. ఈ పథకం కింద డ్రోన్ల ధరపై ఎనభై శాతం సబ్సిడి ఇస్తుంది. మరికొంత మొత్తాన్ని కోరమండల కంపెనీ లబ్దిదారులకు చేకూరుస్తుంది. వీటిని స్వయం సహాయక గ్రూపుల్లో మహిళలు అందిస్తారు. వీటిని ఉపయోగించేందుకు అవసరమైన శిక్షణ కూడా కోరమండల్ కంపెనీ ఇస్తుంది. వర్చువల్ గా ప్రధాని మోడీ ఈ పథకాన్ని ఈ రోజు ప్రారంభించారు. 108 మహిళలకు డ్రోన్లు అందించారు. గుంటూరు జిల్లా పత్రిపాడు మండలం అబ్బినేనిగుంట పాలంలో మహిళలు ఈ డ్రోన్లు అందుకున్నారు.

Drones
వ్యవసాయ రంగంలో ఉపయోగించే డ్రోన్ల ద్వారా ఏడాదికి లక్ష రూపాయల వరకూ ఆదాయం వస్తుందని కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఉపాధ్యక్షుడు సుబ్బారెడ్డి చెప్పారు. తమ పొలంలో ఉపయోగించుకోవడమే కాకుండా ఇతరుల పొలాల్లోనూ పురుగు మందులు పిచికారీ చేయడానికి వీటిని వినయోగించవచ్చని ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ఉపకులపతి జయలక్ష్మీదేవి చెప్పారు. తక్కువ సమయంలో ఎక్కువ ఎకరాల్లో పురుగ మందు పిచికారీ చేయవచ్చన్నారు. తద్వార పంటలను సకాలంలో కాపాడుకోవచ్చన్నారు. ఇప్పటివరకూ కూలీలు మాత్రమే పురుగు మందులు పిచికారీ చేస్తున్నారన్నారు. పంటల సాగులో అధిక దిగుబడులు సాధించడంతో పాటు మహిళలు అధిక ఆదాయం పొందేందుకు డ్రోన్లు ఉపయోగపడతాయంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




