AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Caste Census: కులగణన వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వం.. కారణం ఏంటో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన ప్రక్రియను వాయిదా వేసింది. నవంబర్ 27వ తేదీ నుంచి కులగణన సర్వే చేపట్టాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. డిజిటల్ విధానంలో మొత్తం డోర్ టు డోర్ సర్వే చేపట్టాలని ప్రభుత్వం గైడ్ లైన్స్ కూడా జారీ చేసింది.

AP Caste Census: కులగణన వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వం.. కారణం ఏంటో తెలుసా..?
Ch. Venu Gopala Krishna
S Haseena
| Edited By: Balaraju Goud|

Updated on: Nov 24, 2023 | 8:39 PM

Share

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన ప్రక్రియను వాయిదా వేసింది. నవంబర్ 27వ తేదీ నుంచి కులగణన సర్వే చేపట్టాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. డిజిటల్ విధానంలో మొత్తం డోర్ టు డోర్ సర్వే చేపట్టాలని ప్రభుత్వం గైడ్ లైన్స్ కూడా జారీ చేసింది. ఇప్పటికే కులగణన ఎలా చేపట్టాలి? ఇంటింటికీ వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడగాలి వంటి అంశాలపై అధికారులు, సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా కులగణన కోసం గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది వినియోగించుకోవాలని నిర్ణయించింది ప్రభుత్వం. వాలంటీర్లు ఆధ్వర్యంలో కులగణన జరిగేలా అంతా సిద్ధం చేశారు. మరోవైపు కులసంఘాల, నిపుణులతో జిల్లావారీ గాను, ప్రాంతీయ సమావేశాలు కూడా నిర్వహించారు. ఇప్పటికే విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, కర్నూల్‌‌లో ప్రాంతీయ సమావేశాలు పూర్తయ్యాయి. తిరుపతిలో నవంబఱ్ నెల 28న ప్రాంతీయ సదస్సు జరగనుంది. మరోవైపు పైలెట్ ప్రాజెక్టుగా ఐదు సచివాలయాల పరిధిలో సర్వే కూడా విజయవంతంగా పూర్తి చేశారు అధికారులు. అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత చివరి నిమిషంలో కులగణన ప్రక్రియ వాయిదా వేస్తున్నట్లు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ప్రకటించారు.

ఈ కారణాలతోనే వాయిదా వేశామని చెబుతున్న ప్రభుత్వం

దేశంలో బీహార్ తర్వాత ఆంధ్రప్రదేశ్ మాత్రమే కులగణన చేయాలని నిర్ణయించింది. దీనికోసం ఆరుగురు అధికారుల కమిటీని నియమించింది. ఈ బృందం బీహార్ రాష్ట్రంలో పర్యటించి, అక్కడ కులగణన జరిగిన విధానంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. కమిటీ నివేదిక ఆధారంగా కేబినెట్ కూడా కులగణన చేపట్టేందుకు ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ నిర్ణయం తర్వాత ప్రక్రియను వేగవంతం చేసింది. కొన్ని కారణాలతో నవంబర్ 27 నుంచి ప్రారంభం కావాల్సిన కులగణన ప్రక్రియను డిసెంబర్ పదో తేదీకి వాయిదా వేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి కొన్ని కారణాలు కూడా చెప్తున్నారు మంత్రి వేణుగోపాల కృష్ణ. పేదల జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకే కులగణన అని, మెరుగ్గా ఈ ప్రక్రియను చేపట్టాలనే ఉద్దేశంతో వాయిదా వేశామన్నారు మంత్రి.

ఇప్పటికే కులగణనపై జిల్లా స్థాయిలో, రీజినల్ స్థాయిలో కుల పెద్దలతో సమావేశాలు ముగిశాయి. కుల సంఘాల సూచనలు పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు మంత్రి వేణుగోపాల్. మండల స్థాయిలో కూడా సమావేశాలు నిర్వహించి ఎక్కువ మంది అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత ముందుకెళ్తాలనే కారణంతో వాయిదా వేసినట్లు ప్రభుత్వం చెబుతుంది. కులగణనపై చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కూడా మంత్రి వేణుగోపాల్ చెప్తున్నారు. వాస్తవంగా మొదట్లో అనుకున్న షెడ్యూల్ ప్రకారం నవంబర్ 27 నుంచి ప్రారంభించి వారం రోజుల్లోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే, డిసెంబర్ 10 నుంచి ప్రారంభించి వారంలో ప్రక్రియ పూర్తి చేసేలా కొత్తగా షెడ్యూల్ ను రూపొందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ