AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అతనికి 32.. ఆమెకు 19.. మాట్లాడాలి రమ్మంటూ పిలిచి.. మెడలో తాళికట్టి పరార్..!

బాపట్ల జిల్లాలో ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. యువతి తన ప్రేమను తిరస్కరించినా వెంటాడుతూ, యాసిడ్ పోస్తానంటూ బెదిరించిన వ్యక్తి.. మాట్లాడాల్సి ఉందంటూ గుడికి పిలిచి బలవంతంగా మెడలో తాళి కట్టిన ఘటన కలకలం రేపింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Andhra Pradesh: అతనికి 32.. ఆమెకు 19.. మాట్లాడాలి రమ్మంటూ పిలిచి.. మెడలో తాళికట్టి పరార్..!
Chebrolu Police Station
T Nagaraju
| Edited By: |

Updated on: Aug 02, 2026 | 12:55 PM

Share

ప్రేమ పేరుతో వేధించడమే కాకుండా మాట్లాడాలని గుడికి పిలిచి మెడలో తాళి కట్టిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాపట్ల జిల్లా చుండూరుకు చెందిన 19 ఏళ్ల యువతి చేబ్రోలు ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇంజనీరింగ్ చదువుతుంది. ప్రతి రోజూ ఇంటి నుండి కాలేజీకి వెళ్లి వస్తుంది. అయితే గత కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన 32 ఏళ్ల శివ కోటేశ్వరరావు ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. అయితే తనకి ఇష్టం లేదని చెప్పినా వినకుండా యాసిడ్ పోస్తానంటూ బెదిరిస్తున్నాడు. ఇంట్లో తెలిస్తే చదువు మానిపిస్తారన్న భయంతో ఆ యువతి ఇంట్లో శివ కోటేశ్వరరావు గురించి చెప్పలేదు.

అయితే జూలై నెల 18వ తేదిన శివ కోటేశ్వరావు యువతికి ఫోన్ చేసి తాను చెప్పిన చోటుకు రావాలంటూ పట్టుబట్టాడు. రాకపోతే ఇద్దరి పోటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు. దీంతో ఆమె అతను చెప్పిన చేబ్రోలులోని బ్రహ్మ దేవాలయంకు వచ్చింది. అక్కడకు వచ్చిన వెంటనే ఆ యువతి మెడలో తాళి కట్టిన శివ కోటేశ్వరరావు ఫోటోలు కూడా తీయించాడు. ఆ తర్వాత ఆమె మెడలోని తాళిని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయాడు.

ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసింది. శివ కోటేశ్వరరావుపై పోలీసులకు యువతి తండ్రి ఫిర్యాదు చేశాడు. తన కుమార్తెను ప్రేమ పేరుతో వేధించడమే కాకుండా యాసిడ్ పోస్తానని, సోషల్ మీడియాలో పోస్టులు పెడతానని బెదిరించిన శివ కోటేశ్వరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తండ్రి ఫిర్యాదుతో చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us