AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇకపై ఆఫీస్‌కు రావొద్దు.. అధికారులే మీ ఇంటికొస్తారు.. దివ్యాంగుడికి విశాఖ కలెక్టర్ భరోసా

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో విశాఖ జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ మానవతా దృక్పథం చాటుకున్నారు. కలెక్టరేట్‌కు వచ్చిన ఓ దివ్యాంగుడి సమస్యను చూసి చలించిపోయిన ఆయన, స్వయంగా అతని వద్దకు వెళ్లి సమస్యను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారానికి భరోసా ఇచ్చారు.

ఇకపై ఆఫీస్‌కు రావొద్దు.. అధికారులే మీ ఇంటికొస్తారు.. దివ్యాంగుడికి విశాఖ కలెక్టర్ భరోసా
Visakhapatnam News
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Aug 24, 2026 | 9:00 PM

Share

ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ తన మానవతా దృక్పథాన్ని చాట్టుకున్నారు. కలెక్టర్ రేట్‌కు వచ్చిన ఆయన తన వాహనం దిగి మెట్లు ఎక్కుతుండగా, వాలంటీర్ సహాయంతో లిఫ్ట్ వైపు వెళ్తున్న ఓ దివ్యాంగుడిని చూశారు. వెంటనే ఆగి, స్వయంగా ఆ దివ్యాంగుడి వద్దకు వెళ్లిఏమైంది.. మీ సమస్య ఏమిటి? అంటూ ఆప్యాయంగా ఆరా తీశారు. అయితే అతని పక్కనే ఉన్న తల్లిదండ్రులు తమది భీమిలి మండలం చిప్పాడ గ్రామమని.. మానసిక వికలాంగుడైన తమ కుమారుడు జి. రాంబాబుకు ప్రస్తుతం వికలాంగుల కోటా కింద నెలకు రూ. 6,000 పింఛను అందుతోందని తెలిపారు.

అయితే రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే తమకు, రాంబాబు పోషణకు ప్రస్తుతం అందుతున్న మొత్తం సరిపోవడం లేదని అతని తల్లిదండ్రులు కలెక్టర్‌కు వివరించారు. తమ కుమారుడిని బెడ్ రిడెన్ కేటగిరీ కింద పరిగణించి నెలకు రూ. 15,000 పింఛను మంజూరు చేయాలని కోరారు. వారి గోడును సానుభూతితో విన్న కలెక్టర్.. వీలైనంత వేగంగా సమస్యను పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.

అంతేకాకుండా, దివ్యాంగుడైన రాంబాబును ఇకపై ఇలా శ్రమకోర్చి కలెక్టరేట్‌కు తీసుకురావొద్దని.. సమస్య పరిష్కారానికి అధికారులే మీ ఇంటికి వస్తారని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. తాము ప్రత్యేకంగా అర్జీ ఇచ్చేందుకు ఎదురుచూడాల్సిన పనిలేకుండా, కలెక్టరే తమ వద్దకు వచ్చి సమస్యను అడిగి తెలుసుకోవడంపై రాంబాబు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మనసున్న కలెక్టర్ .. మాన‌వ‌త్వంతో స్పందించారు
మనసున్న కలెక్టర్ .. మాన‌వ‌త్వంతో స్పందించారు
యూపీఐ ద్వారా పెద్ద మొత్తంలో లావాదేవీలు చేస్తే ఐటీ నోటీసులొస్తాయా?
యూపీఐ ద్వారా పెద్ద మొత్తంలో లావాదేవీలు చేస్తే ఐటీ నోటీసులొస్తాయా?
గిల్‌కు ఇచ్చిపడేసిన పంత్.. డబ్ల్యూటీసీలో తోపుగాడిగా భారీ రికార్డ్
గిల్‌కు ఇచ్చిపడేసిన పంత్.. డబ్ల్యూటీసీలో తోపుగాడిగా భారీ రికార్డ్
మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..
మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..
దవడలో నొప్పి.. గొంతులో మంట! ఇవి కనిపిస్తే గుండెకు రిస్క్
దవడలో నొప్పి.. గొంతులో మంట! ఇవి కనిపిస్తే గుండెకు రిస్క్
అల్యూమినియం ఫాయిల్‌లో ఉడికించిన ఆహారం మీరూ తింటున్నారా?
అల్యూమినియం ఫాయిల్‌లో ఉడికించిన ఆహారం మీరూ తింటున్నారా?
108 రకాల పిండి వంటలతో కురుపాం పైడిమారమ్మ అమ్మవారికి సారె సమర్పణ
108 రకాల పిండి వంటలతో కురుపాం పైడిమారమ్మ అమ్మవారికి సారె సమర్పణ
ముప్పుతిప్పలు పెట్టే పైథాగరస్ థియరీ ఇంత ఈజీనా.. దీని వెనుక కథ ఇదే
ముప్పుతిప్పలు పెట్టే పైథాగరస్ థియరీ ఇంత ఈజీనా.. దీని వెనుక కథ ఇదే
Video: జురెల్ బైసెప్‌ వెనుక అసలు కథ వేరే ఉందిగా..!
Video: జురెల్ బైసెప్‌ వెనుక అసలు కథ వేరే ఉందిగా..!
టిఫిన్‌కు ముందు ఈ మ్యాజిక్ డ్రింక్ తాగండి.. ఇక అమేజింగే
టిఫిన్‌కు ముందు ఈ మ్యాజిక్ డ్రింక్ తాగండి.. ఇక అమేజింగే