AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరోతో నటించే ఛాన్స్ వచ్చింది.. కానీ నేనే నో చెప్పా..! షాకింగ్ విషయం చెప్పిన ఆమని

టాలీవుడ్ సీనియర్ నటి ఆమని ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, పని పట్ల అంకితభావం, అలాగే వ్యక్తిగత జీవితంలోని సవాళ్ల గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అలాగే టాలీవుడ్ లోని స్టార్ హీరోల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు .

ఆ హీరోతో నటించే ఛాన్స్ వచ్చింది.. కానీ నేనే నో చెప్పా..! షాకింగ్ విషయం చెప్పిన ఆమని
Aamani
Rajeev Rayala
|

Updated on: Aug 26, 2026 | 12:00 PM

Share

సినిమా ఇండస్ట్రీలో  తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు అందాల హీరోయిన్ ఆమని. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. ఆమె నటనకు ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఆమని.. ఆతర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఇక సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టిసినిమాలు, సీరియల్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ఆమనీ. ఇదిలా ఉంటే ఓ ఇంటర్వ్యూలో ఆమని కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

అసలు ఆ సినిమా చేయాలనుకోలేదు.. అనుకోకుండా చేశాం..! పెద్ద హిట్ అయ్యింది

సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి కూడా ఆమని మాట్లాడారు. ముఖ్యంగా, తొలినాళ్లలో రంగు విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని, తాను, రోజా వంటి నటీమణులు ఈ సమస్యను ఎదుర్కొన్నామని తెలిపారు. అప్పట్లో నగ్మా, రంభ వంటి ఉత్తరాది నటీమణులు పరిశ్రమలోకి ప్రవేశించడంతో, గ్లామర్ ప్రాధాన్యత పెరిగిందని, దీంతో కొంతమంది డస్కీ కలర్ ఉన్న నటీమణుల పట్ల వివక్ష చూపేవారని అన్నారు ఆమని. అయితే, వాణిశ్రీ, రాధిక, సరిత, జయసుధ వంటి నటీమణులు రంగుతో సంబంధం లేకుండా తమ నటనతో అగ్రస్థానానికి చేరుకున్నారని గుర్తుచేశారు.

మహేష్ బాబుకు అమ్మగా నటించాలని ఉంది.. ఆ ఛాన్స్ ఎప్పుడొస్తుందో.!

అగ్ర హీరోలతో నటించే అవకాశాల గురించి మాట్లాడుతూ, వెంకటేష్‌తో కలిసి నటించలేదని, ఆయన ఎక్కువగా సౌందర్యతో సినిమాలు చేశారని ఆమని తెలిపారు. చిరంజీవి గారి రిక్షావోడు చిత్రంలో అవకాశం వచ్చినా, షూటింగ్ ప్రారంభానికి 15 రోజుల ముందు దర్శకుడు మారడంతో ఆ అవకాశం చేజారిందని, తన పాత్రకు నగ్మాను తీసుకున్నారని చెప్పారు. అలాగే, చిరంజీవి గారి స్టాలిన్ చిత్రంలో అక్క పాత్ర (ఖుష్బూ పోషించినది) కోసం తనను అడిగినా, చిరంజీవి పక్కన హీరోయిన్‌గా మాత్రమే చేయాలనే కోరికతో ఆ పాత్రను తిరస్కరించానని వెల్లడించారు. ఈ అవకాశం తనకు ఎంతగానో ఇష్టమైన చిరంజీవి గారికి అక్కగా నటించడం ఇష్టం లేక వదులుకున్నట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ, వెంకటేష్, చిరంజీవి వంటి హీరోలు కలిసినప్పుడు ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారని ఆమని సంతోషం వ్యక్తం చేశారు. తన సహజ నటనతో తాను ఎందరికో స్ఫూర్తిగా నిలిచానని, అలాంటి పాత్రలు దొరకడం తన అదృష్టమని ఆమని తెలిపారు.

ఇవి కూడా చదవండి

చూడటానికి అలా ఉంటుంది కానీ.. ఆమెకు పొగరెక్కువ..! సాయి పల్లవి నిజస్వరూపం ఇదే అంటున్న యంగ్ హీరో

Chiranjeevi

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Follow Us