AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat: పశ్చిమ కనుమల్లో ‘నారింజ వర్ణపు పాములా’ వందే భారత్.. నెటిజన్లను మురిపిస్తున్న డ్రోన్ వీడియో!

Vande Bharat Video: ఈ వందే భారత్ రైలు దృశ్యాలను చూసిన నెటిజన్లు భారత్ సాధిస్తున్న ఇంజనీరింగ్ అద్భుతాన్ని కొనియాడుతున్నారు. ఆధునిక సాంకేతికతకు, ప్రకృతి సౌందర్యానికి కలయిక ఈ దృశ్యం.. నడిబొడ్డు అడవిలో రైలు మార్గాన్ని నిర్మించిన ఇంజనీర్ల కష్టానికి సలాం.. భారతీయ రైల్వే చరిత్రలో ఇది ఒక స్వర్ణయుగం.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Vande Bharat: పశ్చిమ కనుమల్లో ‘నారింజ వర్ణపు పాములా’ వందే భారత్.. నెటిజన్లను మురిపిస్తున్న డ్రోన్ వీడియో!
Vande Bharat Video
Subhash Goud
|

Updated on: Aug 25, 2026 | 8:09 AM

Share

Vande Bharat Video: మంచు తెరల నడుమ.. పచ్చని అడవులు, ఎత్తైన కొండల మధ్య నుంచి దూసుకుపోతున్న ఆరెంజ్ రంగు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పశ్చిమ కనుమల ప్రకృతి అందాల నడుమ నుంచి ఈ రైలు వెళ్తున్న తీరు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

మబ్బులను చీల్చుకుంటూ..

కర్ణాటకలోని సకలేశ్‌పూర్ – సుబ్రహ్మణ్య రోడ్ ఘాట్ సెక్షన్ (శిరాడి ఘాట్) పరిధిలో నిర్వహించిన వందే భారత్ రైలు ట్రయల్ రన్ సమయంలో ఈ అద్భుత డ్రోన్ వీడియోను తీశారు. బెంగళూరు – మంగళూరు రైల్వే మార్గంలో అత్యంత క్లిష్టమైన కొండ ప్రాంతం ద్వారా ఈ రైలు ప్రయాణించింది. దట్టమైన పచ్చని అడవి, వర్షపు మంచు పొరల గుండా ఈ ఆరెంజ్ అండ్ వైట్ రంగు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణిస్తున్నప్పుడు.. పైనుంచి చూస్తే ఒక “నారింజ రంగు పాము (Orange Snake)” పాకుతున్నట్లుగా కనిపించింది.

ఇది కూడా చదవండి: Gold Price Today: మళ్లీ అదే జోరు.. తులం బంగారం ధరపై ఎంత పెరిగిందో తెలుసా..?

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్:

ఈ విజువల్స్ పంచుకుంటూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ (ట్విట్టర్)లో “కొత్త తరం రైళ్లు! మేక్ ఇన్ ఇండియాను మరింత వేగవంతం చేద్దాం” అని క్యాప్షన్ ఇచ్చారు.

అత్యంత క్లిష్టమైన రూట్:

ఈ సకలేశ్‌పూర్ – సుబ్రహ్మణ్య రోడ్ ఘాట్ మార్గం భారత రైల్వేలోనే అత్యంత సవాలుతో కూడుకున్నది.

  • 57 సొరంగాలు
  • 258 వంతెనలు
  • 108 తీవ్రమైన మలుపులు

ఈ క్లిష్టమైన కొండ దారిలో వందే భారత్ రైలు పనితీరును, వేగాన్ని, భద్రతను అంచనా వేసేందుకు రైల్వే అధికారులు ఈ ట్రయల్ రన్ నిర్వహించారు.

నెటిజన్ల ప్రశంసలు:

ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు భారత్ సాధిస్తున్న ఇంజనీరింగ్ అద్భుతాన్ని కొనియాడుతున్నారు. ఆధునిక సాంకేతికతకు, ప్రకృతి సౌందర్యానికి కలయిక ఈ దృశ్యం.. నడిబొడ్డు అడవిలో రైలు మార్గాన్ని నిర్మించిన ఇంజనీర్ల కష్టానికి సలాం.. భారతీయ రైల్వే చరిత్రలో ఇది ఒక స్వర్ణయుగం.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇది కూడా చదవండి: Gas Cylinder: సంచలన నిర్ణయం.. మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు

ఇది కూడా చదవండి: LIC Policy: రోజుకు కేవలం రూ.172 ఆదాతో చేతికి రూ.28 లక్షలు.. ఎల్‌ఐసీలో అదిరిపోయే పాలసీ!

ఇది కూడా చదవండి: Building Construction: పునాది నుంచి స్లాబ్ వరకు ఒక పిల్లర్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us