AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: మళ్లీ అదే జోరు.. తులం బంగారం ధరపై ఎంత పెరిగిందో తెలుసా..?

Gold, Silver Prices Today:అమెరికా డాలర్ విలువ, బాండ్ ఈల్డ్స్ (బాండ్ల మీద వచ్చే రాబడి)కు డిమాండ్ క్షీణించడం వంటి కారణాలతో గ్లోబల్ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఆ ప్రభావం దేశీయంగానూ కనిపిస్తోంది. అక్కడ పెరిగితే దేశీయంగానూ ధరలు పెరుగుతుంటాయి..

Gold Price Today: మళ్లీ అదే జోరు.. తులం బంగారం ధరపై ఎంత పెరిగిందో తెలుసా..?
పశ్చిమాసియాలో భగ్గుమన్న మంటలతో పసిడి ధరలు నేలచూపులు చూశాయి. ఈ నెల ఆరంభం నుంచి భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు భారీగా తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. గ్లోబల్ మార్కెట్‌లో అమెరికన్ డాలర్ సూచీ మళ్లీ బలం పుంజుకోవడం, యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ పెరగడంతో పసిడికి డిమాండ్ తగ్గింది. సాధారణంగా డాలర్ వ్యాల్యూ పెరిగినప్పుడు విదేశీ ఇన్వెస్టర్లకు బంగారం కొనుగోలు ఖరీదైనదిగా మారి డిమాండ్ క్షీణిస్తుంది.
Subhash Goud
|

Updated on: Aug 25, 2026 | 6:34 AM

Share

Gold, Silver Prices Today: బంగారం ధరలు నిరంతరం హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. బంగారం ప్రతిరోజూ కొత్త గరిష్ట స్థాయిలకు చేరుకుంటోంది. అదేవిధంగా వారంలో మొదటి రోజైన ఈరోజు కూడా బంగారం ధరలు మళ్లీ గణనీయంగా పెరిగాయి. నిన్న ఒక తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ.880 పెరిగింది. ఇప్పుడు అదే ధరతో కొనసాగుతోంది. బంగారం ధరల పెరుగుదల కారణంగా వినియోగదారులు అసంతృప్తిగా ఉన్నారు. తాజాగా ఆగస్ట్‌ 25న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

గుడ్ రిటర్న్స్ అందించిన సమాచారం ప్రకారం1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ. 89 పెరిగి, దాని ధర రూ. 16,397 కి చేరింది. 1 తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 890 పెరిగింది. ఈ బంగారాన్ని కొనడానికి ఈరోజు మీరు రూ. 1,63,980 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా గణనీయంగా పెరిగింది. ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90 పెరగడంతో ఈ బంగారం రూ. 15,040కి చేరింది. అదే ఒక తులం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 800 పెరగగా, దాని ధర రూ. 1,50,310 వద్ద ట్రేడవుతోంది.

అలాగే 24, 22 క్యారెట్ల బంగారం తర్వాత18 క్యారెట్ల బంగారం ధర కూడా గణనీయంగా పెరిగింది. ఒక గ్రాము బంగారం ధర రూ. 62 పెరగగా, దీనిని కొనడానికి మీరు రూ. 12,294 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక తులం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 610 పెరగగా, ఈ బంగారం రూ. 1,22,940కు అమ్ముడవుతోంది. ఇదిలా ఉండగా, వెండి ధర కూడా పరుగులు పెడుతోంది. 1 గ్రాము వెండి రూ. 260కి అమ్ముడవుతోంది. 10 గ్రాముల వెండి ధర రూ. 2,600గా ఉంది. కాగా, 1 కిలో వెండి ధర రూ. 2,60,000కి చేరింది.

ఇవి కూడా చదవండి

బంగారం ధరల పెరుగుదలకు కారణాలు

అమెరికా డాలర్ విలువ, బాండ్ ఈల్డ్స్ (బాండ్ల మీద వచ్చే రాబడి)కు డిమాండ్ క్షీణించడం వంటి కారణాలతో గ్లోబల్ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఆ ప్రభావం దేశీయంగానూ కనిపిస్తోంది. అక్కడ పెరిగితే దేశీయంగానూ ధరలు పెరుగుతుంటాయి. అలాగే ద్రవ్యోల్బణం, రూపాయి విలువ, ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలు, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల వంటి చాలా అంశాలు నేరుగా బంగారంపై ప్రభావం చూపిస్తుంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us