ప్రాణం తీసిన ఈత సరదా.. నీటిలో మునిగి.. ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకుపోయి..

ఆ కుటుంబంపై విధి కన్నెర్ర చేసింది. ప్రాణంగా చూసుకుంటున్న కుమారుడిని నీరు రూపంలో మృత్యువు(Death) కబళించింది. అల్లారు ముద్దుగా చూసుకుంటున్న కుమారుడికి బాల్యంలోనే..

ప్రాణం తీసిన ఈత సరదా.. నీటిలో మునిగి.. ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకుపోయి..
Swimming Death
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 20, 2022 | 6:44 AM

ఆ కుటుంబంపై విధి కన్నెర్ర చేసింది. ప్రాణంగా చూసుకుంటున్న కుమారుడిని నీరు రూపంలో మృత్యువు(Death) కబళించింది. అల్లారు ముద్దుగా చూసుకుంటున్న కుమారుడికి బాల్యంలోనే శ్వాసకోశ సమస్యలు తలెత్తాయి. ఎలాగైనా కాపాడుకోవాలని రూ.5 లక్షలు అప్పులు చేసి వైద్యం చేయించారు. ఆరోగ్యం కాస్త కుదుటపడ్డాక పాఠశాలకు వెళ్లడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో స్కూల్ కు వెళ్లి తిరిగి వస్తుండగా సరదాగా ఈత కొట్టేందుకు కాల్వలోకి దిగాడు. నీటి ప్రవాహ వేగానికి కొట్టుకునిపోయాడు. ఊపిరాడక నీటిలో మునిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్థానికులు, కుటుంబసభ్యులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. కర్నూలు(Kurnool) జిల్లా గోనెగండ్ల(Gonegandla)లో జరిగిన ఈ ఘటన కంటతడి పెట్టిస్తోంది. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఐరన్‌బండకు చెందిన ముల్లా మాబాషా, ఫాతిమా దంపతులు నివాసముంటున్నారు. వారికి కుమారుడు, కుమార్తె సంతానం. భార్యాభర్తలిద్దరూ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.

కుమారుడు సోహెల్ గోనెగండ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదివుతున్నాడు. ఈ క్రమంలో శనివారం పాఠశాలకు వెళ్లిన సోహెల్‌.. తిరిగి స్వగ్రామానికి వెళ్లే సమయంలో నలుగురు మిత్రులతో కలిసి స్థానికంగా ఉన్న ఎల్‌ఎల్‌సీ కాల్వలో ఈతకు దిగాడు. నీటి ప్రవాహ వేగానికి మునిగిపోయు కొట్టుకుపోయాడు. గమనించిన తోటి విద్యార్థులు గట్టిగా కేకలు వేయడంతో సమీపంలోని రైతులు, గ్రామస్థులు వచ్చి విద్యార్థిని కాపాడేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే సోహెల్ మృతి చెందాడు. బాలుడి మృతదేహాన్ని గ్రామస్థులు ఒడ్డుకు తీసుకువచ్చారు. కుమారుడి మృతితో తల్లిదండ్రుల రోదనలు కంటతడి పెట్టించాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read

Anantapur Accident: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా.. ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం..

Viral Photos: కుక్కలంటే కొంతమందికి ఇష్టం.. మరికొంతమందికి పిచ్చి.. ఈ ఫొటోలు చూస్తే ఒప్పుకోక తప్పదు..?

Ipl 2022 Auction: సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌కు కొత్త అసిస్టెంట్‌ కోచ్‌.. సైమన్‌ కటిచ్‌ స్థానంలో ఎవరు రానున్నారంటే..