BJP MP GVL: వైసీపీ ప్రభుత్వం నిధుల దుర్వినియోగానికి పాల్పడుతోంది.. బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు

BJP MP GVL: త్రిసభ్య కమిటీలో వివాదాస్పద అంశాల కంటే తెలంగాణా(Telangana)కు సంబంధించిన అంశాలు ఉండటమే మేలన్న ఉద్దేశ్యంతో ప్రత్యేక హోదా అంశాన్ని హోంశాఖ తొలగించిందని టీవీ 9తో బీజేపీ రాజ్యసభ సభ్యుడు..

BJP MP GVL: వైసీపీ ప్రభుత్వం నిధుల దుర్వినియోగానికి పాల్పడుతోంది.. బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు
Bjp Mp Gvl Narasimha Rao
Follow us
Surya Kala

|

Updated on: Feb 15, 2022 | 6:39 PM

BJP MP GVL: త్రిసభ్య కమిటీలో వివాదాస్పద అంశాల కంటే తెలంగాణా(Telangana)కు సంబంధించిన అంశాలు ఉండటమే మేలన్న ఉద్దేశ్యంతో ప్రత్యేక హోదా అంశాన్ని హోంశాఖ తొలగించిందని టీవీ 9తో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు చెప్పారు. అంతేకాదు ఈ సందర్భంగా జీవీఎల్‌ నరసింహారావు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలను తెలుగు ప్రజలతో పంచుకున్నారు. తాను కూడా త్రిసభ్య కమిటీలో వివాదాస్పద అంశాలను తొలగించాలని సూచించినట్లు తెలిపారు.. అయితే ఇలా తొలగించిన ఆంశాలను ప్రత్యేకంగా, విడిగా చర్చించాలని కోరానని తెలిపారు. ఇప్పుడు  తాను కోరిన విధంగానే వైసిపి కూడా ఇదే పద్దతిలో కోరాలని సూచించారు. తెలంగాణ సీఎం కేసిఆర్‌ బిజెపిని టార్గెట్‌ చేసి మాట్లాడుతున్నారు. ఆయనకు బిజెపి అంటే భయం పట్టుకుంది..రానున్న ఎన్నికల్లో బిజెపి ఓడిస్తుందన్న భయంతో కేంద్రాన్ని, ప్రధాని మోడీని కేసిఆర్‌ టార్గెట్‌ చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు ఏపీలో బీజేపీ ప్రత్యామ్నాయం అవుతుందని, తెలంగాణా తరహా పరిణామాలు ఇక్కడ కూడా పునరావృతమవుతున్నాయన్న భయంతో వైసిపి చవకబారు ప్రయత్నాలు చేస్తుందని తీవ్ర విమర్శలు చేశారు జీవీఎల్. ఏపీ లో వైసీపీ నుంచి 22 మంది ఎంపిలు గెలిచారు.. 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు… వీరు ఏం చేస్తున్నారో ఎవరికీ  తెలియదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ప్రజలను ఉద్దేశించి..బీజీపీ కి ఒక్క ఎంపి, ఎమ్మెల్యే సీటు ఇవ్వకుండా మమ్మల్ని పోరాటం చేయమంటే ఎలా అంటూ ప్రశ్నించారు. నిజానికి ఏపీకి ఆరేళ్ళలో మూడు రెట్ల నిధులను కేంద్రం ఇచ్చింది. 24 వేల కోట్ల నుంచి 77 వేల కోట్ల వరకు కేంద్రం నిధులు ఇస్తోంది.. గత ఏడాది ఏపీ నుంచి కేంద్రానికి  55 వేల కోట్ల రూపాయలు పన్నులు వెళితే..  కేంద్రం నుంచి 77 వేల కోట్లు వచ్చాయని లెక్కలు చెప్పారు. అయితే ఏపీ  ప్రభుత్వం చేతకాని ప్రభుత్వమని.. అందుకనే కేంద్రం ఇచ్చిన నిధులను సక్రమంగా వినియోగించుకోలేక, అభివృద్దిపై దృష్టి పెట్టక.. ఆ నిధులను దారి మళ్ళిస్తూ దుర్వినియోగం చేస్తోందంటూ ఏపీ సర్కార్ పై జీవీఎల్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీకి ఏపీ ప్రజలు అధికారం ఇస్తే నిధుల్ని సక్రమంగా వినియోగిస్తామని.. ప్రజల అభివృద్ధికి పాటుపడతామని బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్‌ నరసింహారావు చెప్పారు.

Also Read:

రోజురోజుకీ తెలివి మీరుతోన్న స్మగ్లింగ్‌ రాయుళ్లు.. బంగారాన్ని అక్రమంగా ఎలా తరలించారో చూడండి..

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!