AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: దసరా బంపర్ ఆఫర్.. పట్టుచీరల కోసం భారీగా తరలివచ్చిన మగువలు!

పట్టు చీరలంటే మహిళలకు విపరీతమైన పిచ్చి.. అలాంటి పట్టు చీరలు ఉచితంగా ఇస్తానంటే ఎవరు వద్దంటారు. అసలే వచ్చేది దసరా.. అమ్మవారి ఆలయానికి పట్టుచీరలో వెళ్లాలని ప్రతి మహిళ అనుకుంటుంది. అలాంటి పట్టు చీరల ఫ్రీగా వస్తున్నాయని తెలియడంతో భారీగాతరలి వచ్చారు అక్కడి మహిళలు. దీంతో అనుకున్నవాటి కంటే ఎక్కువ చీరలు తెప్పించి పంపిణీ చేశారు దాతలు. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా అయితే చూద్దాం రండి.

Andhra News: దసరా బంపర్ ఆఫర్.. పట్టుచీరల కోసం భారీగా తరలివచ్చిన మగువలు!
Andhra News
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Sep 21, 2025 | 2:57 PM

Share

తూర్పుగోదావరి జిల్లా, గోకవరంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దసరా కానుకగా మహిళలకు పట్టు చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ విషయం తెలిసిన స్థానికంగా ఉన్న మహిళలు చీరల కోసం భారీగా తరలి వచ్చారు. అయితే ఇక్కడ 2వేల పట్టు చీరలు పంపిణీ చేయాలనుకున్న ఆయన మహిళలు భారీగా రావడంతో వాటి సంఖ్యను.. మరిన్ని చీరలు తెప్పించి ఐదువేల చీరల వరకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా ఉత్సవాల్లో అమ్మవారి హంసగా ప్రతి ఒక్క మహిళ కూడా పట్టుచీరలు ధరించి భక్తి శ్రద్ధలతో హిందూ ధార్మికతను మరింత పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఈ చీరలు పంపిణీ కార్యక్రమానికి ముందడుగు వేశానంటూ కంబాల శ్రీనివాసరావు వెల్లడించారు.

గత మూడు రోజుల కిందట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా కుల మతాలకు అతీతంగా 8,000 మందికి పైగా పట్టుచీరలు పంపిణీ కార్యక్రమం చేశామని, ఇందులో భాగంగానే దసరా ఉత్సవాలకు కూడా మరో రెండు వేల మంది మహిళలకు చీరల పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టామన్నారు. బంగారు వరలక్ష్మి కానుక ద్వారా 600 మందికి బంగారు రూపంలో పంపిణీ చేసిన.. రెండు నెలలు గడవక ముందే మళ్లీ కంబాల కానుక.. వనితల వేడుక అనే కార్యక్రమం ద్వారా పట్టుచీరల పంపిణీ చేశామని తెలిపారు.

మహిళల్లో ఆధ్యాత్మికంగా చైతన్యం పెంపొందించేందుకు నిరంతరం సేవ చేసుకుంటానంటూ, వారికి ఏ సహాయం కావాలన్నా కంబాల కార్యాలయం ఎప్పుడూ తెరిచి ఉంటుందని ఆయన అన్నారు. నరేంద్ర మోడీ ఆశయాలకు అనుగుణంగా పేదలకు సేవ చేయడమే తన లక్ష్యం అని ఆయన తెలిపారు. అందులో భాగంగానే ఈ కార్యక్రమాలు చేపడుతున్నానట్టు చెప్పుకొచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి