మళ్లీ అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు వీడియోTV9
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో కుండపోత వర్షాలతో పాటు, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 27వ తేదీ నాటికి ఇది వాయుగుండంగా బలపడి, పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఒడిశా తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకారం, శనివారం రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు, కూలీలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.
మరిన్ని వీడియోల కోసం :
మీ వీధిలో బొంతలు కుట్టేవాళ్లు తిరుగుతున్నారా.. జాగ్రత్త వీడియో – TV9
ప్రభాస్ చిత్రంలో అభిషేక్ బచ్చన్? వీడియో
5 రూపాయలకే చొక్కా.. ఎగబడిన జనం..ట్విస్ట్ మాత్రం అదిరింది..- TV9
భలే కొట్టేశారు.. తిరిగి తెచ్చి అక్కడే పెట్టేశారు..ఎందుకంటే వీడియో
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

