5 రూపాయలకే చొక్కా.. ఎగబడిన జనం..ట్విస్ట్ మాత్రం అదిరింది..- TV9
కోడంగల్‌లోని ఓ వస్త్ర దుకాణం ఐదు రూపాయలకే చొక్కాలు అందిస్తున్నట్లు ప్రకటించడంతో భారీ జనం తరలివచ్చారు. అయితే, ఈ ఆఫర్ దుకాణ యజమాని ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లకు మాత్రమే అని తేలింది. వందలాది మంది తెల్లవారుజాము నుంచే వరుసలో నిలబడిన ఘటనను ఈ వార్త వివరిస్తుంది.
నారాయణపేట జిల్లా, కొడంగల్ పట్టణంలోని ఓ వస్త్ర దుకాణం కేవలం రూ. 5కే చొక్కా అందిస్తామని ప్రకటించడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో దుకాణం ముందు బారులు తీరారు. అయితే, ఈ ఆఫర్ అందరికీ వర్తించదని దుకాణ యజమాని తెలిపారు. కొడంగల్ బస్టాండ్ వద్ద ఉన్న వస్త్ర దుకాణ యజమాని తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల కోసం మాత్రమే ఈ ప్రత్యేక ఈ ఆఫర్ ప్రకటించినట్టు తెలిపారు. కానీ ఆఫర్ చూసి తెల్లవారుజాము నుంచే యువకులు భారీ సంఖ్యలో దుకాణం వద్దకు చేరుకున్నారు. వందలాది మంది దాదాపు రెండు గంటల పాటు దుకాణం ముందు వరుసలో నిలుచున్నారు. జనం అధిక సంఖ్యలో రావడంతో దుకాణం తెరవడం యజమానికి కష్టతరంగా మారింది. చివరకు దుకాణం తెరిచి, వచ్చిన అందరికీ దుస్తులను అందించారు.
మరిన్ని వీడియోల కోసం :
అమెజాన్, కార్ల్స్‌బర్గ్ కార్లైల్, గోద్రేజ్, ఉబర్ ప్రతినిధులతో సమావేశం వీడియో
అంబర్‌పేట్ బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం వీడియో
అంత్యక్రియలకు వెళ్లొస్తూ నలుగురు మృతి..వారి అంత్యక్రియలకు వెళ్లి మరో ముగ్గురు వీడియో
ఆగిన అంబులెన్స్.. దారిలోనే పోయిన ప్రాణం వీడియో
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
