AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ వీడియో

భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ వీడియో

Samatha J
|

Updated on: Sep 20, 2025 | 4:24 PM

Share

రష్యాను వరుస భూకంపాలు వెంటాడుతున్నాయి. సెప్టెంబరు 13న రష్యా తూర్పు తీరంలోని కమ్చట్కా ద్వీపకల్పంలో భారీ భూకంపం సంభవించింది. ఈ శక్తిమంతమైన భూకంపం నేపథ్యంలో అధికారులు సమీప తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. కాగా తాజాగా మరోసారి ఈ ద్వీపకల్పాన్ని భూకంపం వణికించింది. శుక్రవారం తెల్లవారుజామున 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తీరప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.

కమ్చట్కా రాజధాని పెట్రోపావ్లోవ్స్క్-కమ్చట్స్కీ నగరానికి తూర్పున 128 కి.మీ దూరంలో, సముద్ర గర్భంలో కేవలం 10 కి.మీ లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంప తీవ్రతకు ఇళ్లలోని ఫర్నిచర్, ఇతర వస్తువులు తీవ్రంగా కంపించాయి. వీధుల్లో పార్క్‌ చేసిన కార్లు సైతం ఊగిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే, రష్యాకు చెందిన భూభౌతిక సేవల విభాగం మాత్రం భూకంప తీవ్రత 7.4గా నమోదైందని, దీని తర్వాత ఐదుసార్లు భూమి స్వల్పంగా కంపించిందని పేర్కొంది. అమెరికా పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తీర ప్రాంతాలపై ప్రమాదకరమైన అలలు విరుచుకుపడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ ఘటనపై కమ్చట్కా గవర్నర్ వ్లాదిమిర్ సోలోడోవ్ టెలిగ్రామ్ ద్వారా స్పందించారు. “ప్రస్తుతానికి ఎలాంటి ఆస్తి లేదా ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదని, ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని సూచించారు.

మరిన్ని వీడియోల కోసం :

అమెజాన్, కార్ల్స్‌బర్గ్ కార్లైల్, గోద్రేజ్, ఉబర్ ప్రతినిధులతో సమావేశం వీడియో

అంబర్‌పేట్ బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం వీడియో

అంత్యక్రియలకు వెళ్లొస్తూ నలుగురు మృతి..వారి అంత్యక్రియలకు వెళ్లి మరో ముగ్గురు వీడియో

ఆగిన అంబులెన్స్.. దారిలోనే పోయిన ప్రాణం వీడియో

Published on: Sep 20, 2025 04:06 PM