AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆగిన అంబులెన్స్.. దారిలోనే పోయిన ప్రాణం వీడియో

ఆగిన అంబులెన్స్.. దారిలోనే పోయిన ప్రాణం వీడియో

Samatha J
|

Updated on: Sep 19, 2025 | 7:54 AM

Share

వర్షాకాలం కావడంతో గ్రామీణ ప్రాంతాలలో పాములు చెలరేగిపోతున్నాయి. ఆవాసం కోసం, ఆహారం కోసం వెతుకుతూ జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఇళ్లలో చేరి అక్కడి ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో పలువురు పాముకాట్లకు గురవుతున్నారు. తాజాగా ఇంట్లో నిద్రిస్తున్న ఓ చిన్నారి పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయింది. సకాలంలో వైద్యం అందక కళ్లముందే బాలిక మృతిచెందడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటన అల్లూరి జిల్లాలో జరిగింది.

పెదవలస పంచాయతీ గొంతు వలస గ్రామానికి చెందిన మర్రి కవి అనే బాలిక.. ఐదో తరగతి చదువుతోంది. ఇంట్లో చిన్నారి నిద్రిస్తుండగా ఇంట్లోకి చొరబడిన పాము బాలికను కాటు వేసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్ కు సమాచారం అందించారు. అయితే అంబులెన్స్ మరో రోగిని తరలిస్తుండటంతో ఫీడర్ అంబులెన్స్‌కు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న ఫీడర్‌ అంబులెన్స్‌లో చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో అంబులెన్స్‌లో సమస్య తలెత్తి ఆగిపోయింది. దాంతో చేసేది లేక బాలికను టూ వీలర్ పై పెదవలస ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే జరగకూడనిది జరిగిపోయింది. బాలికను పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్టు దృవీకరించారు. కళ్లముందే చిన్నారి విగతజీవిగా మారిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సకాలంలో అంబులెన్స్‌ వచ్చి ఆస్పత్రికి తరలించి ఉంటే బాలిక ప్రాణం దక్కేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం :

రాజీనామాను ఆమోదించాలని ఎమ్మెల్సీ కవిత ఫోన్ చేశారు వీడియో

విమానంలో టీ కోసం గొడవ చెట్టంత మగాడిని చావబాదిన మహిళ వీడియో

సీనియర్ నటి రమాప్రభ అల్లుడు .. తెలుగులో తోపు హీరో.. ఫాలోయింగ్ ఎక్కువే వీడియో

సార్‌.. అమ్మ చదువుకోమంటోంది.. తల్లిపై ఫిర్యాదు చేసిన బాలుడు వీడియో